Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త

Srisailam temple: ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్‌లోనే ఉంచుతున్నారు.

తాజాగా స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను కూడా ఆలయ అధికారులు పునరుద్ధరించారు. తాజా నిర్ణయంతో ఇకపై శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు మల్లికార్జునుడిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈ మూడు రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్‌లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్‌లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు.

Srisailam temple authorities reinstead Sparsha Darshan slot

శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం పూట కూడా స్పర్శదర్శనం కల్పించాలంటూ భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తోన్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని పునఃప్రారంభించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఇటీవలే దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ, వసతి విభాగం అధికారులు ఇందులో పాల్గొన్నారు. మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం కల్పించడానికి వైదిక కమిటీ, అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. దీనితో దీన్ని పునరుద్ధరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

గతంలో ఈ ఆలయంలో సేవా టికెట్ల జారీలో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆలయంలో జారీ చేసే అన్ని రకాల ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ విధానానికి బదులుగా ఆన్‌లైన్ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో తాము బుక్ చేసుకున్న టికెట్ల కాపీని దర్శన సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వాటిని స్కాన్ చేసి, సదరు భక్తుడి వివరాలు సరిపోలిన తరువాతే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఇక 150 రూపాయల శీఘ్ర దర్శనం, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లు మాత్రం ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు. కరెంట్ బుకింగ్ ద్వారా కూడా భక్తులు వాటిని పొందవచ్చు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్లల్లో 30 శాతం ఆన్‌లైన్ బుకింగ్ కోసం కేటాయించారు. మిగిలిన 70 శాతం టికెట్లను కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+