రావాలని ఉన్నా, తొక్కిసలాట కారణంతో రాలేకపోతున్నా:పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని ఘాట్ వద్ద జరిగిన విషాదం పైన స్పందించారు. తొక్కిసలాట కారణంగా 27 మంది వరకు మృతి చెందారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు.
మంగళవారం నాడు పుష్కరాల సందర్భంగా జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని, గాయపడిన వారికి సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు.

తనకు సంఘటన స్థలానికి వచ్చి ప్రత్యక్షంగా పరామర్శించి, సహాయక చర్యలలో పాల్గొనాలని ఉందని కానీ, తాను రావడం వల్ల మళ్లీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించినందు వల్లే మిన్నకుండిపోయానని ట్వీట్ చేశారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈరోజు పుష్కరాలలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయపడిన వారికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2015 ..చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2015 అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా..
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2015 దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావటం విరమించుకున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2015 సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా 'జనసేన' కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2015 











Click it and Unblock the Notifications