Nayanthara: స్టార్ హీరోయిన్ నయనతార గ్లామర్ సీక్రెట్స్ ఇవే.. మీరూ ట్రై చెయ్యొచ్చు!!
సినీ తారలు చాలాకాలంపాటు గ్లామరస్ గా, అందంగా కనిపించడానికి ఖచ్చితంగా కేర్ తీసుకుంటారు. అయితే సహజంగా చాలామంది వాళ్లు చాలా కాస్ట్లీ ఫుడ్ తింటారు అని, అందం కోసం, ఆరోగ్యం కోసం బాగా ఖర్చు పెడతారని, అదంతా మనం చేయలేము అని భావిస్తూ ఉంటారు. కానీ అది ఖచ్చితంగా తప్పని చాలామంది హీరోయిన్లు చెప్పిన మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చాలా కాలం పాటు తన కెరీర్ ని కొనసాగిస్తూ, అదే గ్లామర్ తో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గ్లామర్ సీక్రెట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నయనతార తను ఇంత ఫిట్ గా, అందంగా, ఆరోగ్యంగా ఉండటం వెనుక కారణాలను తెలిపారు. ప్రతిరోజు తాను వ్యాయామం ఖచ్చితంగా చేస్తానని, జిమ్ లో వర్కౌట్స్, అలాగే క్రమం తప్పకుండా యోగా చేస్తానని నయనతార తెలిపారు. అంతేకాదు తాను తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహిస్తానని, ఏ డైట్ పడితే ఆ డైట్ తాను తీసుకోనని చెప్పారు.

తాను ఏ డైట్ ప్లాన్ చేసుకున్నానో, అదే డైట్ ను రెగ్యులర్ గా తీసుకునేలా చూస్తానని, ఈ విషయంలో ఎటువంటి మార్పు రాకుండా జాగ్రత్త పడతానని నయనతార పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మంచినీళ్ళను మించిన ఔషధం లేదని తన అభిప్రాయమని నయనతార వెల్లడించారు. తాను మంచినీళ్లు ఎక్కువగా తాగుతానని, మన శరీరం హైడ్రేటెడ్ గా ఉండడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి తగినంత మంచినీళ్లు తాగాలని ఆమె తెలిపారు.
ఇక తన గ్లామర్ కు మరో సీక్రెట్.. ప్రతిరోజు తన కచ్చితంగా ఎనిమిది గంటల పాటు నిద్ర పోతానని నయనతార వెల్లడించారు. క్రమం తప్పకుండా నయనతార వ్యాయామ, ఆహార, నిద్ర అలవాట్లు నయనతార ఆరోగ్యంగా ఉండడానికి, మంచి ఫిట్ నెస్ తో గ్లామరస్ గా కనిపించడానికి కారణం.
నిజంగా నయనతార చెప్పిన విషయాలు మనం చేయలేని, బాగా ఖర్చయ్యే విషయాలు ఏవీ లేవు. నయనతార చెప్పిన సీక్రెట్ ను ఫాలో అవ్వడం అంత కష్టమేమీ కాదు. కేవలం కావలసింది ఖచ్చితంగా ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వాలి అన్న నిబద్ధత మాత్రమే. ఆ ఒక్కటీ ఉంటే నయనతార లాగా మీరు అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోవచ్చు.












Click it and Unblock the Notifications