లోకల్ పోలింగ్‌పై డేగకన్ను: ఒక్కో జిల్లాకు ఒక్కో కీలక ఐఎఎస్: తప్పు చేస్తే..!

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించడంపై కసరత్తు ఆరంభమైంది. ఎక్కడ? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఐఎఎస్ అధికారులను జిల్లా పరిశీలకులుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున ఐఎఎస్ అధికారులు పరిశీలకులుగా నియమితులయ్యారు.

శ్రీకాకుళం- ఎం రామారావు, విజయనగరం-శోభ, విశాఖపట్నం-ప్రవీణ్ కుమార్, తూర్పు గోదావరి-పీ ఉషా కుమారి, పశ్చిమ గోదావరి-హిమాన్షు శుక్లా, కృష్ణా-ఎం పద్మ, గుంటూరు-కాంతిలాల్ దండే, ప్రకాశం-కే శారదా దేవి, నెల్లూరు-బీ రామారావు, చిత్తూరు- టీ బాబూరావు నాయుడు, కడప-పీ రంజిత్ భాషా, అనంతపురం-కే హర్షవర్ధన్, కర్నూలు- కేఆర్‌బిహెచ్ఎన్ చక్రవర్తి - కర్నూలు నియమితులయ్యారు. వారితో మరో నలుగురు సీనియర్ సీహెచ్ శ్రీధర్, జీ రేఖారాణి, టీకే రామమణి, ఎన్ ప్రభాకర్ రెడ్డిలను అదనంగా నియమించింది.

 State Election Commission appointed IAS Officers for monitoring Local Body elections

ప్రస్తుతం ఉన్న ఆయా జిల్లా కలెక్టర్లతో పాటు కొత్తగా పరిశీలకులుగా నియమితులైన ఐఎఎస్ అధికారులు జిల్లా పాలన, పోలీసు యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని రమేష్ కుమార్ తెలిపారు.

పరిపాలన సౌలభ్యం మేరకు.. జిల్లా కలెక్టర్లు రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలకులను నియమించుకోవడానికి వీలు కల్పించింది. క్షేత్రస్థాయిలో అధికార, పోలీసు యంత్రాంగం నుంచి సమాచారాన్ని తెప్పించుకుని, పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగడానికి వీలైన వాతావరణాన్ని వారు కల్పించాల్సి ఉంటుంది.

Recommended Video

    AP Local Body Elections 2020 Schedule | Government's Incentives To Unanimous Panchayats | Oneindia

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+