ఏపీలో మూడు విమానాశ్రయాల పేర్ల మార్పు: అవి ఏవంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విమానాశ్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మూడు ఎయిర్‌పోర్టుల పేర్లకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. తిరుపతి విమానాశ్రయాన్ని శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా, విజయవాడ ఎయిర్ పోర్టుకు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) పేరు పెట్టాలని ప్రతిపాదనలు పంపింది.
ఇక, కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ నుంచి మూడు విమానాశ్రయాలకు పేర్లను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు.

రాష్ట్రంలోని తిరుపతి ఎయిర్‌పోర్ట్ పేరును శ్రీ వేంకటేశ్వర విమానాశ్రయంగా మార్చాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మరో రెండు విమానాశ్రయాల పేర్ల మార్పునూ ప్రతిపాదించింది.
కాగా, 10 రాష్ట్రాలు 22 ఎయిర్ పోర్టుల పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్బంగా ఎయిర్ పోర్టును విద్యాపతి విమానాశ్రయంగా మార్చాలని బీహార్ ప్రభుత్వం కోరింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల పేర్లను మార్చాలని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపాయని కేంద్రమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications