దారుణం: రెండో భార్యతో కలిసి కూతుర్ని చంపిన తండ్రి

అనంతరం శ్రీనివాస రావు చింతలచెర్వుకు చెందిన ఏగమ్మను రెండో పెళ్ళి చేసుకున్నాడు. వెంకాయమ్మకు విడాకులు ఇవ్వక పోవడంతో కుమార్తె చందన (16) తండ్రి వద్దే ఉంటోంది. చందన మేనత్త వెంకట లింగమ్మ(శ్రీను అక్క) తన భర్త చనిపోవడంతో బొగ్గరంలోనే నివాసం ఉంటోంది. తల్లిలేని చందనను చేరదీసింది. తనకున్న ఆరెకరం పొలం, ఇంటిని చందనకు రాసి ఇచ్చింది. మేనత్త చనిపోయిన తర్వాత కూడా తండ్రి శ్రీనివాస రావు, సవతి తల్లి ఏగమ్మతో కలిసి చందన ఉంటోంది.
ఈ నేపథ్యంలో కొంతకాలంగా సవతి తల్లి ఏగమ్మకు చందనకు మధ్య మనస్పర్థలు ఏ ర్పడి తరచూ ఘర్షణ పడుతున్నారు. దీంతో ఇరవై రోజుల నుంచి చందన అదే ఇంట్లో వేరుగా ఉంటోంది. శనివారం ఉదయం సవతి తల్లి ఏగమ్మకు చందనకు మధ్య గొడవ జరిగింది. తండ్రి కూతురు చందనను ఇంట్లోకి లాక్కెళ్ళి కొట్టి, కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. కిటికీలోంచి మంటలు, పొగ రావడంతో చుట్టు ప్రక్కల జనం వచ్చే సరికి తలుపు తీసుకొని మంటలతో చందన హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీసింది.
స్థానికిలు ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందన మృతి చెందింది. సవతి తల్లిని, తండ్రిపై హత్య కేసు నమోదు చేసినట్లు వినుకొండ రూరల్ సిఐ తెలిపారు. ఆస్తి కోసమే చందనను చంపారని స్థానికులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications