చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి: ఎన్ఎస్‌జీ కమాండర్ తలకు గాయం
ప్రకాశం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షం, ఈదురుగాలులు వీస్తున్నా చంద్రబాబు నాయుడు తన రోడ్ షో కొనసాగించారు. ఈ క్రమంలో యర్రగొండపాలెంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చంద్రబాబు యర్రగొండపాలెం వస్తుండగా అధికార వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు.
చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన ఎన్ఎస్‌జీ సిబ్బంది చంద్రబాబుపై రాళ్లు పడకుండా బుల్లెట్ ప్రూఫ్ షీట్లను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ఎన్ఎస్‌జీ కమాండర్ సంతోష్ కుమార్ తలకు గాయమైంది. వెంటనే ఆయనకు వైద్యులు కుట్లువేసి కట్టుకట్టారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

వాహనం నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ఎదుటే వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు నెట్టేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసు తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబడ్దార్ అంటూ మంత్రిని, ఆయన అనుచరులను హెచ్చరించారు. అంతకుముందు కూడా మంత్రి సురేష్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
యర్రగొండపాలెం రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రౌడీలు రోడ్డు మీదకు వస్తున్నారని.. తన ముందు గుప్పిగంతులు వేయొద్దని వైసీపీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ఒక్కడా చూడలేదన్నారు. మంత్రి సురేష్ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని మండిపడ్డారు. అభివృద్ధి పనులు పూర్తి చేయలేని అసమర్థుడు ఆదిమూలపు సురేష్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు.
కాగా, చంద్రబాబు యర్రగొండపాలెం వచ్చే మార్గంలో ప్లకార్డులు, నల్లజెండాలతో సురేష్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఎస్సీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో ఎన్ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించాయి.












Click it and Unblock the Notifications