ఏపీలో విద్యార్ధిసంఘాల ఛలో కలెక్టరేట్..పలుజిల్లాల్లో ఉద్రిక్తత; హౌస్ అరెస్టులు, అరెస్టులతో ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం, అదేవిధంగా పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ల కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా పిడిఎస్యు, ఎస్ఎఫ్ ఐ, ఏబీవీపీ, ఎన్ ఎస్ యు ఐ, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, పీ వై ఎల్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేస్తున్న నిరుద్యోగ యువతను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్ధి సంఘాల ఛలో కలెక్టరేట్ .. విజయనగరంలో విద్యార్థుల ర్యాలీ
ఇదిలా ఉంటే విద్యార్థి సంఘాల జిల్లా కలెక్టరేట్ల ముట్టడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ, విజయనగరం, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలలో పోలీసులు ఆందోళనకారులను ఎక్కడెక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇక విజయనగరంలో ఉద్యోగ సాధన సమితి ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. మూడు లాంతర్ల సెంటర్ నుండి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇక విద్యార్థులను ఎవరినీ నిరసనలకు అనుమతించవద్దని కళాశాలల యాజమాన్యాలకు పోలీసులు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు.

విజయవాడ లెనిన్ సెంటర్ లో పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
ఇక విజయవాడలోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు దిగారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇక పోలీసుల తీరుపై, ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పను మడమ తిప్పను మన జగన్ హామీలు మాటలకే పరిమితం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
మరోవైపు కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం చేశాయి. ఇక పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు గేట్ ఎక్కి కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు దాదాపు 200 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. 2.35 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్
ఇక విశాఖలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. బుధవారం రోజు రాత్రి చాలా మంది విద్యార్థి నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉద్రిక్తతల మధ్య విద్యార్థుల ఛలో కలెక్టరేట్ కార్యక్రమం కొనసాగుతోంది. గ్రూప్ వన్, గ్రూప్ టు పోస్టుల సంఖ్యను పెంచాలని, పోలీస్ శాఖ పోస్టులు 6500 భర్తీ చేయాలని, కొత్త డీఎస్సీ లు ప్రకటించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 .3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి.
Recommended Video

నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జగన్ స్పందించే వరకు ఆందోళనలు చేస్తామన్న విద్యార్ధి సంఘాలు
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందో చూపించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లకోసం హామీలు ఇచ్చి, ఆ హామీలు నెరవేర్చడంలో జగన్ విఫలమయ్యారని, ఇక ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తూ కేసులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జగన్ స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థి సంఘాల నాయకులు తేల్చి చెబుతున్నారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications