ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారు, ఆర్నెళ్ళకే దంపతుల ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ప్రేమించి పెళ్ళి చేసుకొన్న ఆరు నెలలకే ఆ దంపతులు అనుమానాస్పదస్థితిలో మరణించారు. భార్యను చంపేసి భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహలను పోస్ట్ మార్టం కోసం పంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు ప్రకటించారు.

అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలం కొడవగానుపల్లికి చెందిన పి. కేశవ, రమణమ్మల మొదటి కూతురు రేణుక అదే జిల్లా ధర్మవరం మండలం బిళ్ళవంపల్లికి చెందిన త్రినందతో ఏడాది క్రితం పరిచయమైంది. వీరిద్దరికీ కడప జిల్లా ప్రొద్దుటూరులో పరిచయమైంది. ఆ సమయంలో రేణుక హస్టల్‌లో ఉంటూ నర్సింగ్ చదివేది. అయితే అదే ప్రాంతంలో వాషింగ్ మెషీన్ల సర్వీసింగ్ సెంటర్లో త్రినంద పనిచేసేవాడు.

Suicide Trinanda After kills his wife in Gudur

రేణుకకు బంధువైన ఏకానంద ద్వారా త్రినంద పరిచయమయ్యాడు. ఆరు మసాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరుకు వచ్చి వారు వివాహం చేసుకొన్నారు. గూడూరులోని గమళ్ళపాలెం మహలక్ష్మమ్మ వీధిలో ఓ ఇంట్లో కాపురం పెట్టారు. ఏప్రిల్ 14వ తేదిన పుట్టింటికి వస్తానని అంతకుముందు రోజే రేణుక తమతో చెప్పిందని మృతురాలి తల్లిదండ్రులు చెప్పారు. అయితే మరునాడు ఆమె కోసం ఫోన్ చేస్తే ఎంతకీ ఫోన్ పనిచేయకపోవడంతో తాము గూడూరుకు వచ్చినట్టు చెబుతున్నారు.

అయితే రెండు రోజుల క్రితం భార్య,భర్తల మధ్య గొడవ జరిగిన తర్వాత భార్యను చంపి ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతదేహలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. మృతుల ఫోన్లకు వచ్చిన కాల్స్ ఆధారంగా ఈ కేసును మరింత సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు మృతదేహలను పోస్ట్‌మార్టం కోసం పంపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Suicide Trinanda After killed his wife Renuka at Gudur town in Nellore dsitrict on Sunday. They are married six months back.police registered case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X