రెండున్నరేళ్ల పాటు కరువే! ఎల్‌నినో వచ్చేసింది!

పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఉష్ణోగ్రతల మార్పులు ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా భారతదేశాన్ని కలవరపెడుతున్నాయి. తటస్థంగా ఉన్న పరిస్థితులు వేగంగా 'ఎల్‌ నినో' (El Nino) దిశగా మారుతున్నాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత్‌కు చెందిన ఇన్‌కాయిస్‌ (INCOIS) తాజా బులెటిన్‌లో హెచ్చరించింది.

పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో 'ఎల్‌ నినో' పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు పరిస్థితులు తటస్థంగా ఉన్నప్పటికీ, మే మాసం నుంచి ఎల్‌ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ పరిస్థితులు 2027 జనవరి వరకు అంటే దాదాపు రెండున్నరేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

El Nino Returns INCOIS Predicts Drought Risk for India as Warming Conditions May Last Until January 2027

అత్యాధునిక టెక్నాలజీతో అంచనా..

ఇన్‌కాయిస్‌ తన అంచనాల కోసం 'బేయేసియన్‌ కన్వల్యూషనల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌' (BCNN) అనే అత్యాధునిక డీప్ లెర్నింగ్ మోడల్‌ను ఉపయోగించింది. సముద్ర ఉష్ణోగ్రతలను విశ్లేషించే ఈ మోడల్ ద్వారా, ఎల్‌ నినో లేదా లా నినా వంటి పరిస్థితులను 24 నెలల ముందే గుర్తించే వీలుంటుంది. అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ (CPC) కూడా మే-జూలై మధ్య ఎల్‌ నినో ఏర్పడే అవకాశం 61 శాతంగా ఉందని ధృవీకరించింది.

Super El Nino: రుతుపవనాలు మాయం? రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
Super El Nino: రుతుపవనాలు మాయం? రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

భారత రుతుపవనాలపై తీవ్ర ప్రభావం

ఎల్‌ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం (దాదాపు 92 శాతం) నమోదవుతుందని అంచనా వేసింది.

  • వ్యవసాయంపై సెగ: 2023లో ఎల్‌ నినో ప్రభావంతో దేశంలో 94 శాతం వర్షపాతమే నమోదైంది. దీనివల్ల వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు దెబ్బతిని కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
  • రబీ సాగుకు ముప్పు: ఈ ఏడాది ఎల్‌ నినో జనవరి 2027 వరకు కొనసాగితే, అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ సాగుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.
  • నీటి నిల్వలు: ప్రస్తుతం దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు 40 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. వర్షాలు తగ్గితే తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది.

పర్యావరణ సమతౌల్యానికి హాని

ఎల్‌ నినో వల్ల కేవలం వర్షాలే తగ్గడం కాకుండా, ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన సముద్రపు వేడిగాలులు (Marine Heatwaves) ఏర్పడుతున్నాయని ఇన్‌కాయిస్‌ తెలిపింది. ఇవి సముద్ర జీవజాలానికి మరియు పర్యావరణ సమతౌల్యానికి పెద్ద ముప్పుగా మారనున్నాయి.

Super El Nino: రుతుపవనాల విఫలం, 1997లో ఏమైందో గుర్తుందిగా?
Super El Nino: రుతుపవనాల విఫలం, 1997లో ఏమైందో గుర్తుందిగా?

సూపర్ ఎల్‌ నినో వస్తోందా?

ప్రస్తుత పరిస్థితులు 2015లో వచ్చిన భయంకరమైన ఎల్‌ నినోను తలపించేలా ఉన్నాయని, ఇది 'సూపర్ ఎల్‌ నినో'గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) గనుక సానుకూలంగా ఉంటే, ఎల్‌ నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+