రాజీనామాకు మమతా ససేమిరా, బీజేపీ వాట్ నెక్స్ట్ - కొత్త సంకటం..!?
పశ్చిమ బెంగాల్ లో ఏం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నెల 9న ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తం అవుతోంది. అయితే.. ఇదే సమయంలో మమతా బెనర్జీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను రాజీనామా చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ ఏం జరగే అవకాశం ఉంది. తదుపరి పరిణామాలు ఏంటనే ఉత్కంఠ రాజకీయంగా కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ లో మమత కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడినా.. ముఖ్యమంత్రి పీఠం వీడనని తేల్చి చెబుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఈ నెల 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మమతా కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా తమ రాష్ట్రాన్ని ఆక్రమించారని ఆమె విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేది లేదని ప్రకటించారు. 294 సీట్లకుగాను, బీజేపీకి 206 సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అధికారం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలి. మరోవైపు ఈ నెల 9న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో మమత తన పదవికి రాజీనామా చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. రాజ్యాంగ నిపుణుల ప్రకారం.. మమత తన సీఎం పదవికి రాజీనామా చేయకపోయినా.. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు, కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసే వరకు ఆమె పదవిలో కొనసాగవచ్చు. అయితే, రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల తర్వాత పాత ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. దీని ప్రకారం మే 7న కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అంటే, మే 6 వరకు ఆమె పదవిలో ఉండటానికి అవకాశం ఉంది.

9న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
ఆ తర్వాత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఎలాగూ రద్దు అవుతుంది. మమత రాజీనామా చేయకపోయినా.. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం రద్దవ్వాలి కాబట్టి.. గవర్నర్ మమత ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. మమత పదవికి రాజీనామ చేయకపోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమే. ఆమె నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. లేదంటే సభలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ కోరవచ్చు. ప్రస్తుతం ఆమెకు మెజారిటీ లేదు కాబట్టి.. అక్కడైనా మమత ప్రభుత్వం రద్దవుతుంది. ఆ తర్వాత మెజారిటీ సాధించిన బీజేపీ అధికారం చేపడుతుంది. ఈ ప్రక్రియ మొత్తంలో గవర్నర్ పాత్ర కీలకం గా మారుతోంది. బీజేపీ నేతలు మాత్రం మమతా వ్యాఖ్యల పైన స్పందించటానికి నిరాకరిస్తున్నారు. నూతన సీఎంగా బీజేపీ మహిళకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 9న ప్రమాణ స్వీకారం.. మోదీ, షా తో పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.













Click it and Unblock the Notifications