CJP ఇన్ స్టా అకౌంట్ ను తొలగించారు.. పిరికిపందలు: అభిజిత్ దిప్కే సంచలనం

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇన్ స్టా గ్రామ్ ఖాతాను తొలగించారంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సంచలన పోస్టు పెట్టారు. వాళ్లు అధికారిక ఇన్ స్టా ఖాతాను తొలగించారు.. పిరికిపందలు అంటూ ఎక్స్ మాధ్యమం వేదికగా స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ తొలగింపునకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోల్లో దిస్ పేజ్ ఈజ్ నాట్ ఎవైలబుల్ ఎట్ ది మూమెంట్ అని చూపిస్తోంది. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన ఈ పోస్టు పెట్టారు. ఓవైపు భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకుంటూ ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

దేశ అభివృద్ధిపై ఫోకస్ చేయకుండా సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం, తొలగించడం హేయమైన చర్య అని పేర్కొంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత తప్ప మరొకటి ఉండదని కామెంట్స్ చేస్తున్నారు. మరో యూజర్ కామెంట్ చేస్తూ బెస్ట్ గిఫ్ట్ ఇండిపెండెన్స్ డే రోజున అని స్పష్టం చేశారు. మరికొందరు మాత్రం ఇక అభిజిత్ దిప్కే బోస్టన్ కు వెళ్లిపోతాడని మాట్లాడుకుంటున్నారు. మరో యూజర్ మాత్రం ఇన్ స్టా గ్రామ్ ఖాతా ను మెటా సంస్థ హ్యాండిల్ చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కాదని కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం ఆందోళనలు చేపట్టడంలో ఏమాత్రం వెనక్కు తగ్గేదేలేదు అని స్పష్టం చేస్తోంది. త్వరలోనే కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ సీజన్ 2 కూడా ప్రారంభం అవుతుందని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపాయి. మునుపటి ఆందోళనను మించిన స్థాయిలోనే మరింత విస్తృత సమీకరణతో, ప్రజా సమస్యలపై, ముఖ్యంగా విద్యారంగం సమస్యలపై ఉద్యమిస్తామని వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అందువల్లనే తాజాగా ఇన్ స్టా ఖాతాను బ్లాక్ చేసిందని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

AbhijitDipke Cockroach janata party Instagram account removed a sensational claim on x handle now

ఇక ఇటీవల దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నెల రోజులకుపైగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. జూలై 20 న చేపట్టిన ఛలో పార్లమెంట్ ఘటనతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించి ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీని నియమించింది. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలను విరమించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+