చంద్రబాబు ఓపికకు జోహార్లు, 25ఎంపీలు గెలిస్తే..: మహానాడులో సుజనా చౌదరి

అమరావతి: ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే దేశానికి మంచిదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. మహానాడులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అసమర్థతను టీడీపీ ఎత్తిచూపిందని అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓపికకు జోహార్లు అని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం ఓపిక పట్టాలని చంద్రబాబు పదే పదే కోరారని తెలిపారు. కేంద్రం పేపర్ మీద చెప్పినవన్నీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అన్నారు. సెప్టెంబర్ 2016లో స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామన్న కేంద్రం మాట తప్పిందన్నారు.

Sujana Chowdary takes on at Centre and BJP

అనేక లోపాలతో విభజన బిల్లు తీసుకొచ్చారని, సవరణ చేసే అవకాశం ఉన్నా కేంద్రం చేయడం లేదని సుజనా చౌదరి అన్నారు. పార్లమెంటు చట్టం చేస్తే కేంద్రం అమలు చేయాలని, అయితే అదీ కూడా చేయడం లేదని అన్నారు. తెలంగాణకు ఆస్తులు ఇచ్చి.. ఏపీకి అప్పులు ఇచ్చారని ఆరోపించారు.

80శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ చెప్పుకుంటోందని, అయితే, తెలుగుదేశం పార్టీ పోరాటంతోనే కొంత సాధించామని సుజనా చెప్పారు. 2019లో కేంద్రం అన్యాయాన్ని గమనించి ఓటేయ్యాలని అన్నారు. 25మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే దేశంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేవని, బీజేపీకి కూడా అంతే కానీ, టీడీపీ ఫుణ్యమా అని కొన్ని సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+