స్కూళ్లకు వేసవి సెలవుల పై తాజా నిర్ణయం- ఈ సారి ఇలా..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. ఎండలు అప్పుడే రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో.. పరీక్షలు పూర్తవుతేనే ఈ సారి వేసవి సెలవులు ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఈ వేసవి లో విద్యార్ధులకు 45 రోజుల పాటు వేసవి సెలవులు రానున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పాఠశాలల నిర్వహణ.. పరీక్షల పైన విద్యా శాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు అమలు చేయనున్నారు. మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా 15వ తేదీ నుంచి అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇక, వేసవి సెలవుల విషయంలోనూ కీలక ప్రతిపాదన లు సిద్ధమయ్యాయి. విద్యా క్యాలెండర్ లో తీసుకున్న నిర్ణయం మేరకు వేసవి సెలవుల్లో భాగంగా 45 రోజులకు పైగా వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

Summer holidays for All schools to be implemented from April 24th to June 12

ఏప్రిల్‌ 24నుంచి సెలవులు ప్రకటించి తిరిగి జూన్‌ 12 నుంచి తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం తాజాగా విద్యార్ధులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణకు వీలుగా నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో వేసవి సెలవుల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వచ్చే నూతన విద్యాసంవత్సరంలో అన్ని పాఠశాలల్లో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా నిత్యం విద్యార్ధులు గంట సేపు ఆటలు ఆడేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+