ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!!
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎన్జీటీ విధించిన పెనాల్టీని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో అప్పీల్ కు వెళ్లిన ఓ పిటీషన్ పై ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాయింట్ కమిటీ చేసిన సిఫారసులను సుప్రీంకోర్టు తాజాగా మరోసారి సమర్థించింది. నష్ట పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.

ఎన్జీటీ..
పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ..ప్రాజెక్టుల నిర్మాణ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకుందంటూ ఇదివరకు ఎన్జీటీ జాయింట్ కమిటీ నిర్ధారించింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయా ప్రాజెక్టుల వారీగా జరిమానాను విధించింది.

ప్రాజెక్టులవారీగా..
పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ప్రభుత్వం యథేచ్ఛగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘంచినట్లు పెంటపాటి పుల్లారావు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మేడిచెర్ల సత్యనారాయణ, జమ్ముల చౌదరయ్య ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీన్ని విచారించిన ఎన్జీటీ- ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు- 2 కోట్ల 48 లక్షల రూపాయలు, పట్టిసీమ ప్రాజెక్టు- కోటి 90 లక్షల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

సమర్థించిన సుప్రీం..
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏకంగా 120 కోట్ల రూపాయల పరిహారాన్నివిధించింది. ఈ మొత్తాన్ని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఎన్జీటీ జాయింట్ కమిటీ- ప్రభుత్వానికి ఆదేశిచింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

రూ.120 కోట్లు..
విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు- 2 కోట్ల 48 లక్షల రూపాయలు, పట్టిసీమ ప్రాజెక్టు- కోటి 90 లక్షల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటి విధించిన 120 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపును మరోసారి విచారిస్తామని స్పష్టం చేసింది.

మూడువారాలకు వాయిదా..
జరిమానా చెల్లింపులపై తమకు రెండు వారాల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో జరిమానా చెల్లించారా? లేదా? అనే అంశంపై నివేదిక అందజేయాలని లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. మూడు వారాల తరువాత ఈ పిటీషన్ పై మరోసారి విచారణకు చేపడతామని తెలిపింది. పోలవరంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications