వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు..! వివేకా కేసులో కీలక పరిణామం..

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఆయనతో పాటు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి కూడా నోటీసులు పంపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులు జైల్లో ఉన్నారు. వీరిని నిందితుల్లో ఒకరైన అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు, డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి అప్రూవర్ గా మారిన దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా అవినాష్ రెడ్డికి గతంలో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించి నోటీసులు పంపింది.

supreme court issued notice to Kadapa mp ys avinash reddy in uncle murder case

వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఇందులో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, సాక్షుల్ని బెదిరించకూడదని కూడా ఇచ్చారు. వీటిని అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితులు ఉల్లంఘించారంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టులోని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్.. వీటిపై వివరణ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డితో పాటు జైలుకు వెళ్లి నిందితుల్ని బెదిరించిన ఆరోపలు ఎదుర్కొంటున్న చైతన్య రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+