అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే: సుప్రీం కోర్టు స‌మ‌ర్ధ‌న : అనంత‌లో అద‌న‌పు బ‌లం..

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..వైసిపి కి మ‌రో ఎమ్మెల్యే సీటు అద‌నంగా ద‌క్కింది. 2014 ఎన్నిక‌ల్లో టిడిపి 102 స్థానాల్లో గెల‌వ‌గా..వైసిపి 67 స్థానాల్లో గెలిచింది. అయితే, వైసిపి నుండి 23 మంది ఎమ్మెల్యేలు టిడిపి కి జంప్ అయ్యారు. కానీ, వారి ని ఇంకా సాంకేతికంగా వైసిపి స‌భ్యులుగానే చూపిస్తున్నారు. అందులో కిడారి స‌ర్వేశ్వ‌ర్రావు మావోయిస్టుల చేతిలో హ‌త్య కు గుర‌య్యారు. మ‌రో ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టిడిపికి..శాస‌న‌సభా స‌భ్య‌త్వానికి రాజీనామా చేసారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో టిడిపి చేతిలో ఉన్న స్థానం వైసిపి చేతిలోకి వెళ్లిపోయింది.

కేసీఆర్ గెలుపుపై ఏపీలో సంబరాలు, బీజేపీ బండి సంజయ్ ఓటమితో కేడర్ కంటతడికేసీఆర్ గెలుపుపై ఏపీలో సంబరాలు, బీజేపీ బండి సంజయ్ ఓటమితో కేడర్ కంటతడి

అనంత‌పురం జిల్లా మడకశిర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న వ్య‌వ‌హారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నే సుప్రీం కోర్టు స‌మ‌ర్ధించింది. ఈర‌న్న‌ ఎన్నిక చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. రెండో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థి ఎం. తిప్పేస్వామే ఎమ్మెల్యేగా కొనసాగుతారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2014లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

Supreme court rejected Eranna petition : Ycp contested candidate as Mla..

ఈరన్నపై కర్ణాటకలో రెండు కేసులు ఉన్నా.. వాటిని అఫిడవిట్‌లో పొందు పర్చకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషన్ దాఖలు చేశారు. తిప్పేస్వామి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు పై అప్ప‌ట్లోనే టిడిపి నేత‌లు తాము ఈ తీర్పు పై సుప్రీం కు వెళ్తామ‌ని చెప్పారు.

దీనికి అనుగుణంగానే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఈరన్న సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పును పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈరన్న పిటిషన్‌ను కొట్టివేసింది. రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామే ఎమ్మెల్యే గా కొనసాగుతారని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో..వైసిపి కి న్యాయ‌ప‌రంగా ల‌భించిన మొద‌టి విజ‌యం ఇది. ఇక‌, అనంత‌పురం లోని హిందూపురం మాజీ శాస‌న‌స‌భ్యుడు..మైనార్టీ నేత అబ్దుల్ గ‌ని టిడిపిని వీడి వైసిపి లో చేరారు. ఇప్పుడు అదే జిల్లా లో ఒక స్థానం వైసిపి ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే చేరారు. దీంతో..అనంత లో ప‌ట్టు బిగించాల‌న చూస్తున్న వైసిపికి ఇది క‌లిసొచ్చే అంశం.

English summary
Supreme Court rejected TDP Mla Eranna petition and supported AP High court orders. Supreme Court clarified that YCP contested Candidate continue as MLA form Madakasira.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X