వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

|
Google Oneindia TeluguNews

వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు మళ్లించిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (sdrf) నిధులు తిరిగి వెనక్కివ్వాలని సుప్రీం ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండువారాల్లోగా తిరిగివ్వాలని గడువు ఇవ్వగా ఆ నిధులు వెనక్కిచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని కొవిడ్ బాధిత కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని తెలిపారు. పరిష్కార కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని ధర్మాసనం సూచించింది. నాలుగు వారాల్లో సమస్యను పరిష్కరించాలని కమిటీని కోర్టు ఆదేశించింది.

కొవిడ్ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు వెనక్కి ఇచ్చే విషయంలో ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటామని న్యాయవాది చెప్పగా ఆ అవసరం లేదని తమ విచారణలో కోర్టు స్పష్టం చేసి ఉత్తర్వులిస్తామనగా ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కొంత సమయం కావాలని అడిగారు. తాజాగా వచ్చిన తీర్పుతో నష్టపరిహారం అందని కొవిడ్ బాధితులకు పరిహారం అందుతుందని భావిస్తున్నారు.

supreme court shock to ap government

పీడీ ఖాతాలకు మళ్లించిన కొవిడ్ నిధులు రూ.1100 కోట్లుగా ఉంటాయి. ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవడం, కొవిడ్ వల్ల ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో ఎస్డీఆర్ ఎఫ్ నిధులు మళ్లించిన సంగతి తెలిసిందే. కొవిడ్ తో మృతిచెందిన కుటుంబాలకు పరిహారంగా ఇవ్వడానికి ఈ నిధులు ఉపయోగించాల్సి ఉంటుంది. కేంద్రం వీటిని విడుదల చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యక్తిగత అవసరాలకు వీటిని వాడకూడదు. కానీ ఏపీ ప్రభుత్వం పీడీ ఖాతాలకు ఈ నగదును మళ్లించడంతో కొవిడ్ వల్ల మరణించి బాధిత కుటుంబ సభ్యులు పలువురు సుప్రీం తలుపు తట్టారు. తాజాగా జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం రెండు వారాల్లోగా ఎస్డీఆర్ ఎఫ్ ఖాతాకు మళ్లించాలని ఆదేశించింది.

English summary
Supreme Court shocked AP government regarding diversion of sdrf funds to PD accounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X