ఏపీలో కోవిడ్ మృతుల పరిహారంపై సుప్రీం సీరియస్-నేరుగా పర్యవేక్షణ-కీలక ఆదేశాలు
ఏపీలో కోవిడ్ మృతుల కుటుంబాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సిన రూ.50 వేల రూపాయల పరిహారం ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్ 19 మృతుల కుటుంబాలకు తమ ఆదేశాల తర్వాత కూడా పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు... ఇందుకు బాధ్యత వహిస్తూ సీఎస్ సమీర్ శర్మను కోర్టుకు పిలిపించింది.
Recommended Video
కరోనాతో తమ బంధువులను కోల్పోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రయత్నాలను తామే నిర్వహిచాలని, మార్షల్ చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయించింది, కొన్ని రాష్ట్రాలు తాము సూచించిన పరిహారం చెల్లింపును నామమాత్రంగా చేపట్టడంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఏఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఏపీతో పాటు బీహార్ లోనూ కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రతి కోవిడ్ మృతుని కుటుంబానికి పరిహారంగా ఒక్కొక్కరికి రూ.50,000 చెల్లించడం సంక్షేమ సంకేతమని, అలాగే సంక్షేమ రాజ్యానికి ఇది అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు డబ్బును విడుదల చేయడానికి లేదా అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యం సరైనది కాదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కుటుంబాలకు పరిహారం చెల్లించాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఉందని స్పష్టం చేయడానికి, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించనందుకు బెంచ్ ఏపీ, బీహార్ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది.
విచారణ తర్వాత సుప్రీం ధర్మాసనం తాము నేరుగా జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు చెల్లింపులు జరిగేలా చూడాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అలాగే ఈ చెల్లింపుల పర్యవేక్షణ కోసం జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీలను అంబుడ్స్ మెన్ గా నియమించేలా ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. అలాగే నమోదైన మరణాల కంటే పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులు తక్కువగా ఉన్న ప్రతి రాష్ట్రంలో జోక్యం చేసుకుంటామని కోర్టు తెలిపింది. ఎక్స్ గ్రేషియా మొత్తం చెల్లింపును సులభతరం చేసేందుకు దరఖాస్తుదారులందరి వివరాలను తీసుకోవాలని ఈ రాష్ట్రాల్లోని రాష్ట్ర, జిల్లా న్యాయ సేవల అధికారులను ఆదేశించాలని సుప్రీంకోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications