సీమ విభజనకు నో: పొన్నం, టి బిల్లు పెట్టాలన్న సుష్మ

రాయల తెలంగాణ వద్దని, హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రాయలసీమను విభజించాలని ఎవరు కోరుకోవడం లేదన్నారు. తమ పార్టీ అధిష్టానం పది జిల్లాల తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు.
రాయల తెలంగాణ వల్ల రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. సిడబ్ల్యూసి తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన టినే తాము కోరుకుంటున్నామన్నారు. 10 జిల్లాల తెలంగాణను బలంగా వినిపించాలని తాము కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కోరామని తెలిపారు.
తెలంగాణకే: సుష్మ
తాము హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకే కట్టుబడి ఉన్నామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నాయకులతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చెప్పారు. కోదండరామ్ నేతృత్వంలో ఐకాస నేతలు సుష్మను గురువారం కలిశారు. అనంతరం కోదండ విలేకరులతో మాట్లాడారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణకే తమ పార్టీ కట్టుబడి ఉందని సుష్మా స్వరాజ్ తమకు తెలిపారని అన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని తాను కేంద్రాన్ని కోరినట్లు సుష్మ తమకు తెలిపారన్నారు. తెలంగాణకే బిజెపి మద్దతు ఉందని కోదండ అన్నారు.
సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం తాము భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పార్లమెంటులో హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ బిల్లు పెట్టే వరకు తాము ఎవరినీ నమ్మమని చెప్పారు.












Click it and Unblock the Notifications