రాజమండ్రి లో పవన్ సభకు అనుమతి నో : తేల్చి చెప్పిన పోలీసులు : జనసేనాని ఏం చేస్తారు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన పైన సందిగ్దత కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవటం లేదంటూ జనసేన రోడ్ల దుస్థితి పైన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. స్పందన రావటంతో..అక్టోబర్ రెండున ఆ రెడ్లను బాగు చేస్తూ శ్రమదానం చేయాలని రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా ముందుగా పవన్ కళ్యాణ్ రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మీద రోడ్లను బాగు చేస్తూ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. ధవళేశ్వరం బ్యారేజీతో పాటుగా అనంతపురం జిల్లాలోని పాల్గొనాలని డిసైడ్ అయ్యారు.

అయితే, కాటన్ బ్యారేజీ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని.. బ్యారేజీ మీద గుంతలను సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా పూడ్చాల్సి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో..పవన్ కళ్యాణ్ శ్రమదానం స్థలాన్ని మార్చుకున్నారు. రాజమండ్రి లోని బాలాజీ సెంటర్ లో ఉదయం 9 గంటలకు బాలాజీ సెంటర్ లో బహిరంగ ఏర్పాటుకు నిర్ణయించారు. దీని పైన పోలీసులు తాజాగా ప్రకటన చేసారు. బాలాజీ సెంటర్ లో బహిరంగ సభ కు అనుమతి నిరాకరిస్తున్నట్లుగా ప్రకటించారు.

suspense continues on Pawan Kalayan Rajahmundry tour : police rejected permission for public meeting

అక్కడ సభ నిర్వహిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. దాదాపు 20 వేల మంది వరకు సభకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారని..దీని కారణంగా కరోనా విస్తరించే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు స్థానిక పోలీసు అధికారులు సూచించారు. సభ వేదిక మార్చుకోవాలంటూ పార్టీ నేతలకు సూచించినా.. వారి నుంచి ఇంకా స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో..పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన - శ్రమదానం- సభ పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే సమయంలో అనంతపురం జిల్లాలో పవన్ పర్యటించే ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగానే రోడ్లను బాగు చేస్తుందని..ఇదంతా పవన్ వస్తున్నారనే కారణంగానే ప్రభుత్వం ముందస్తు రిపేర్లు మొదలు పెట్టిందని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే రోడ్డ రిపేర్ల విషయంలో విధాన పరమైన నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రూ 2200 కోట్లతో రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని...వర్షాల కారణంగా..అంతకు ముందు కరోనా వలన ఆలస్యం అయిందని చెబుతున్నారు.

ఇదంతా రోడ్ల పైన గుంతల ముందు నిలబడి ఫొటోలు తీసుకొని ప్రచారం చేసుకోవటానికి మినహా దేనికి ఉపయోగపడదని వైసీపీ నేత సజ్జల చెప్పుకొచ్చారు. దీంతో..గాంధీ జయంతి నాడు సై అంటే సై అంటూ జనసేన నేతలు రాజమండ్రిలో సభకు ముందుకు వస్తారా.. లేక సభా స్థలి మార్చుకుంటారా లేక అనంత పురం పర్యటనకే పరిమితం అవుతారా అనేది ఇప్పుడు జనసేన స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+