వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్లపై ఉత్కంఠ ? తెలంగాణ, మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేశారా ?
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ల వ్యవహారం ఆసక్తి రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్ధాయిలో సజావుగా నడిపించేందుకు వీలుగా ఆవసరమైన మూలధనం సేకరించేందుకు వీలుగా యాజమాన్యం ఈ బిడ్లపై ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు చెందిన అధికారుల్ని అక్కడికి పంపింది. అదే సమయంలో ప్రజల తరఫున తాను బిడ్ వేస్తానంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముందుకొచ్చారు. దీంతో ఈ బిడ్ల వ్యవహారం ఆసక్తి రేపుతోంది.
ఇవాళ బిడ్ల దాఖలుకు సమయం దాదాపు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ బిడ్ వేశారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లక్ష్మీనారాయణ మాత్రం ఇవాళ వైజాగ్ స్టీల్ కు వచ్చారు. స్టీల్ ప్లాంట్ అధికారులతో భేటీ కావడమే కాకుండా తన ఆసక్తి వ్యక్తీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణి అధికారులు బిడ్ వేశారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

రెండు రోజులుగా స్టీల్ ప్లాంట్ లో ఉండి సాధ్యాసాధ్యాలు పరిశీలించిన సింగరేణి అధికారులు సీఎం కేసీఆర్ కు కీలక నివేదిక అందించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేసిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ దాదాపు 23 వరకూ సంస్ధల నుంచి స్లీల్ ప్లాంట్ కోరుతున్న మూలధనం సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఈ వ్యవహారంపై పూర్తి క్లారిటీ రావొచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications