వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి, బాధించింది: ఎస్వీ మోహన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కర్నూలు దీక్ష పైన తనకు సమాచారం ఇవ్వకపోవడం బాధించిందని, ఆయన నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంటాయని టిడిపిలో చేరిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.

జగన్ భవిష్యత్తు గురించి నేను ఏం చెప్పనని అన్నారు. జగన్ నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంటాయన్నారు. భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు పార్టీ మారినప్పుడు తన పైన ఒత్తిడి పెరిగిందన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు.

మా తండ్రి సుబ్బారెడ్డి పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. టీజీ వెంకటేష్‌తో తాను సమన్వయం చేసుకుంటానని చెప్పారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారో లేదో తనకు తెలియదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో తెలియదన్నారు.

SV Mohan Reddy interesting comments on YS Jagan

తనకు టిడిపి నుంచి రూ.100 కోట్ల అభివృద్ధికి హామీ వచ్చిందని చెప్పారు. కర్నూలు దీక్ష పైన జగన్ తనకు సమాచారం ఇవ్వలేదని, ఇది తనను బాధించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని పార్టీ మారుతున్నారని వైసిపి నేతలు చెప్పడం సరికాదన్నారు.

చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమేై పార్టీ మారుతున్నానని, అలాంటప్పుడు కర్నూలు ప్రజలు తనను ఎందుకు తిడతారని ప్రశ్నించారు. తమది మొదటి నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబమేనని, తనకు ఎలాంటి అప్పులు లేవని చెప్పారు.

ప్రత్యేక హోదా రాకుంటే ఏపీకి నష్టమేనని చెప్పారు. అఖిల ప్రియ రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారని కితాబిచ్చారు. కాగా, ఎస్వీ మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిపొందారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు.

English summary
MLA SV Mohan Reddy interesting comments on YSRCP chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X