Chebrolu Kiran: చేబ్రోలు కిరణ్ దుస్ధితిపై టీడీపీలోనే సానుభూతి ? అనుకూల పోస్టులు..!
ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ సస్పెండ్ చేసిన ఐటీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఆయనకు కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇప్పటికే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలకు చేబ్రోలు కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆయన అరెస్టు తర్వాత సీన్ మారుతోంది.
చేబ్రోలు కిరణ్ అరెస్టు తర్వాత ఆయన్ను పోలీసులు తరలించిన తీరు, ప్రెస్ మీట్లో మొహానికి నల్ల ముసుగు ధరించి ప్రవేశపెట్టడం వంటి కారణాలు ఇప్పుడు టీడీపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో సానుభూతి పెంచుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీతో పాటు టీడీపీలో సైతం ఆగ్రహం వ్యక్తమైంది. కానీ పోలీసులు అతన్ని అరెస్టు చేశాక కోర్టుకు తరలించడం, నల్ల ముసుగు వేయడం వంటి కారణాలతో ఇప్పుడు సొంత పార్టీలో సానుభూతి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

సస్పెన్షన్ ఓకే,
— Venugopalreddy Chenchu (NRITDP Spokesperson) (@venuchenchu) April 10, 2025
కేసులు పెట్టడం ఓకే,
అరెస్ట్ కూడా ఓకే,
కానీ ఇలా ఏదో మర్డర్, మానభంగం చేసినవాడిలా ఫేస్ మాస్క్ వేసి నిలబెట్టడం కరెక్ట్ కాదు. 🤔
ఆ కుర్రాడికి మతి స్థిమితం లేదు, ఏదో వీరావేశంలో యూట్యూబ్ వ్యూస్ కోసం మాట్లాడి ఉంటాడు.
కొంచెం ఆలోచించండి, వైసీపీ క్యాడర్లో ఇలాంటీ… pic.twitter.com/SneoXktdpE
వైసీపీలో బోరుగడ్డ, పోసాని వంటి నేతలు గతంలో చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలపై చెలరేగిపోయినా వారికి ఇలా ముసుగులు వేయడం లేదా తరలింపులో ట్రీట్మెంట్ వంటి విషయాల్లో పోలీసులు ఇంత కరకుగా వ్యవహరించలేదని, కానీ ఇప్పుడు చేబ్రోలు కిరణ్ విషయంలో కఠినంగా ఉన్నారని టీడీపీ సానుభూతిపరులు, పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
టీడీపీ కోసం నిరంతరం పోరాడే కార్యకర్త కిరణ్ అన్నను ఈ విదంగా చూస్తాను అనుకోలేదు అది కూడా మన గవర్నమెంట్ లో.......
— MC RAJ🕊️ (@BeingMcking_) April 10, 2025
బాధ తప్పు మాటలు రావడం లేదు...
సారీ కిరణ్ అన్న 🙏 pic.twitter.com/ILBSEuleE4
అయితే పోలీసులు చేబ్రోలు కిరణ్ విషయంలో ఇలా వ్యవహరించడం వెనుక మరో కారణం కనిపిస్తోంది. ఇప్పటికే అతన్ని పోలీసు స్టేషన్ కు తరలించే క్రమంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేసేందుకు ప్రయత్నించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు చేబ్రోలు కిరణ్ కనిపిస్తే దాడికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని రక్షించేందుకే ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుుస్తోంది. అయితే ఇది టీడీపీలో వారికి మాత్రం వేరేలా కనిపిస్తుండటం విశేషం.
ఈ రోజు కిరణ్ ను అరెస్ట్ చేసినదానికన్నా,మీడియా ముందు పెట్టిన విధానం కి నిరసనగా నేను టీడీపీ ని వదిలేస్తున్నా..బోరుగడ్డ గాడిని ఇలానే మీడియా ముందు ముసుగు వేసి చూపించారా?బోరుగడ్డకి పక్కేసి,దిండేసి,బిర్యానీ పెట్టారుగా.కిరణ్ బోరుగడ్డ కంటే ఎక్కువ మాట్లాడాడా?జీవితంలో టీడీపీకి ఓటు వెయ్యను pic.twitter.com/JYRz4IJrMt
— ASK (@ask_onx) April 10, 2025












Click it and Unblock the Notifications