ఓపిక పట్టండి: పటేల్, టి మంత్రులు రిజైన్‌కు సిద్ధపడినా..

తెలంగాణ ప్రాంత మంత్రులు ముఖ్యమంత్రి పైన గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేసే పరిస్థితులు వస్తున్నాయని వారు చెప్పారట. దీనిపై స్పందించిన పటేల్.. కొద్ది రోజులు ఓపిక పట్టాలని సూచించారట.
హైదరాబాదుకు ఏఐసిసి కార్యదర్శి
ఏఐసిసి కార్యదర్శి రామచంద్ర కుంతియా గురువారం ఉదయం హైదరాబాదుకు వచ్చారు. రేపటి నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుంతియా రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ... మంత్రుల శాఖలు మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు, శ్రీధర్ బాబుతో తాను మాట్లాడుతానని చెప్పారు. కాగా, కుంతియాతో శ్రీధర్ బాబు, జానా రెడ్డిలు భేటీ అయ్యారు.
మూకుమ్మడి రాజీనామాకు ఆలోచించినా...
తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో శ్రీధర్ బాబును శాఖను మార్చడంపై మండిపడుతున్న తెలంగాణ ప్రాంత మంత్రులు మూకుమ్మడి రాజీనామా చేయాలని ఓ సమయంలో ఆలోచించారట. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమవుతున్న సమయంలో రాజీనామాలు చేసి అధిష్టానాన్ని ఇబ్బందులకు గురి చేయవద్దని వారు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. తాము ముఖ్యమంత్రిలా ఆవేశపడలేమని టి మంత్రులు చెబుతున్నారట.












Click it and Unblock the Notifications