టి: 9 అంశాలతో స్పీకర్‌కు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చేందుకు తొమ్మిది సవరణ ప్రతిపాదనలు చేశారు. ఇందులో వారు పలు అంశాలను పొందుపర్చారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయవలసిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంత శాసన సభ్యుల ప్రతిపాదనల్లో.... హైదరాబాదును కామన్ క్యాపిటల్‌గా ఉంచవల్సిన అవసరం లేదు. హైదరాబాదు పైన గవర్నర్‌కు అధికారాలు ఉండరాదు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కోర్టులు ఉండాలి. స్థానికత ఆధారంగా పింఛన్లను ఆయా రాష్ట్రాలకు విభజించాలి. ఉద్యోగుల విభజన కూడా అలాగే చేయాలి.

విభజన తర్వాత ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల తరహాలో కొత్త కార్పోరేషన్లు, కంపెనీలను ఏర్పాటు చేయాలి. విద్యుత్ కేటాయింపులపై నేషనలైజేషన్ పద్ధతిని అవలంభించాలి. ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను, ఎన్టీపిసి ఆధ్వర్యంలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను తెలంగాణలో ఏర్పాటు చేయాలి.
కామన్ అడ్మిషన్ విధానాన్ని ఐదేళ్లకే పరిమితం చేయాలి. తెలంగాణ బిల్లుపై ఎలాంటి సవరణలు చేయవద్దు. బిల్లు పైన, క్లాజుల పైన ఓటింగ్ జరపొద్దు. తెలంగాణకు వెటర్నిటీ వర్సిటీని ఇవ్వాలి.












Click it and Unblock the Notifications