దిశా చట్టమేదీ? తాడేపల్లి అంధయువతి హత్యతో రాజీనామాల డిమాండ్: మొదలెట్టిన తెలుగుమహిళలు!!
దిశా చట్టమేదీ? తాడేపల్లి అంధయువతి హత్యతో మంత్రుల రాజీనామాల డిమాండ్ చేసి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిలో అంధ యువతి హత్య ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారింది. తాజాగా ఈ ఘటన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ మహిళా నాయకులు మండిపడ్డారు. సీఎం నివాసానికి సమీపంలో ఘాతకాలు చోటు చేసుకుంటున్న మౌనంగానే ఉంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో అంధ యువతీ హత్య కచ్చితంగా శాంతి భద్రతల వైఫల్యమేనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేదని నిప్పులు జరుగుతున్నారు.

మీ అధికార దాహానికి ఇంకెందరు ఇలా బలయిపోవాలి? వంగలపూడి అనిత
టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత అంధ యువతి హత్య ఘటనను టార్గెట్ చేసి జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.జగన్ రెడ్డి గారు, మీ ఇంటికి కూతవేటు దూరంలోనే అంధ బాలికను నిర్దాక్షిణ్యంగా నరికి చంపేటంత గంజాయి మత్తులో రాష్ట్రం ఉంది అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంధ బాలికకు, మానసిక వికలాంగురాలికీ కూడా రక్షణ లేకుండా పోయింది. తరచూ మీ ఇంటి సమీపంలోనే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నా మీ నుండి ఏ విధమైన చర్యలూ లేవని విమర్శించారు. మీ అధికార దాహానికి ఇంకెందరు ఇలా బలయిపోవాలి? అంటూ ప్రశ్నించారు.

దిశ చట్టం కోసం ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు?
కేసుల మాఫీ కోసం, అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? అందులో పది శాతం దిశ చట్టం కోసం తిరిగి ఉంటే, అది చట్టం అయ్యుంటే, శిక్ష పడుతుంది అనే భయం అయినా ఆ దుండగులకు ఉంటుంది. కానీ మీకు అసలు చిత్తశుద్ధి అనేది ఉంటే కదా? అంటూ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశా చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారని టార్గెట్ చేశారు. అంతేకాదు అంధ బాలిక హత్య కేసులో నిందితులను పట్టుకోవడం చేతకాక, బాధితుల తరపున న్యాయం కోరుతున్న మహిళలను ఈడ్చుకెళుతున్నారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అంటూ నిప్పులు చెరిగారు.

సీఎం, హోమ్ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి
వంగలపూడి అనిత మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం, హోమ్ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. డిజిపి గారూ! మీ పోలీసుల తీరు మీకు కనపడుతుందా? అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి మరీ వంగలపూడి అనిత జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక అంధ యువతి హత్య ఘటనపై టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ కూడా తనదైన శైలిలో మండిపడ్డారు. గంజాయి మత్తులో ఉన్నదుండగుడు కంటిచూపు లేని యువతిని నరికి చంపిన ఘటన దారుణం అన్నారు.

తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో.. అమానుషాలు కనిపించడం లేదా: పంచుమర్తి అనురాధ
జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలోనే జరుగుతున్న అమానుషాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. గతంలో జరిగిన అఘాయిత్యాలపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అందుకే ఇలా విచ్చలవిడిగా దాడులకు హత్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వీళ్ళు ఏమీ చేయరులే అన్న ధైర్యం దుండగులకు వచ్చిందని, భయం అనేది లేకుండా పోయిందని అందుకే ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని నిప్పులు చెరిగారు. దిశా చట్టం ఒక ఫార్స్ అంటూ పంచమర్తి అనురాధ టార్గెట్ చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications