జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్- డీఎస్పీకి రోజుకో అమ్మాయి ! ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆడంగలోడు !
తాడిపత్రిలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రోజురోజుకూ ముదురుతోంది. జేసీ సోదరుల ఓటమి తర్వాత అక్కడ రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్న తొలిసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ధానిక డీఎస్పీ సాయంతో చేస్తున్న రాజకీయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఓ మహిళపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయించిన ఎమ్మెల్యే, డీఎస్పీ చైతన్యపై జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు.
తాడిపత్రి డీఎస్పీ చైతన్య సైకోలా ఉన్నాడని టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే బాగా నెల నెలా మామూళ్లు పంపిస్తున్నారన్నారు. దీంతో ఆడవారి మీద డీఎస్పీ చైతన్య ప్రతాపం చూపిస్తున్నారంటూ విమర్శించారు. డీఎస్పీ చైతన్యకు రోజుకో అమ్మాయి కావాలని, ఆయన హీరో కాదు జీరో అని జేసీ మండిపడ్డారు. ఓ మహిళపై 307 కేసు కట్టడం సిగ్గుచేటని జేసీ విమర్శించారు. డీఎస్పీ హిజ్రాల కన్న దారుణం అని తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్పీ చైతన్య దిగజారి ఆడవారి మీద ప్రతాపం చూపిస్తున్నట్లు జేసీ ఆరోపించారు.

మా ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి ) ఒక ఆడంగలోడని, అందుకే ఆడవారి మీద ప్రతాపం చూపిస్తున్నాడని జేసీ ఆరోపించారు. పట్టణంలో ఇసుక , గంజాయి విస్తృతంగా ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. డీఎస్పీ పైన వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని జేసీ తెలిపారు. తెలుగుదేశం వారి మీద కక్ష సాధింపు చేయడం దౌర్భాగ్యమని,
నీ గురించి ఇక నేను మాట్లాడను.. ఇదే లాస్ట్ అంటూ జేసీ ముగించారు.












Click it and Unblock the Notifications