తెలంగాణపై ఇప్పుడొద్దు, ఎన్నికలయ్యాకే..: గాలి

60ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యను మూడు నెల్లలో పరిష్కరిస్తారా? అని ముద్దు కృష్ణమ కేంద్రాన్ని ప్రశ్నించారు. తమ ఇష్టం వచ్చినట్లు కోసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా సొరకాయా లేక గుమ్మడికాయా.. అని ఆయన అన్నారు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేమైనా అనుబంధ సంస్థా అని ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీ స్టాండ్ తమకు ఉందని ఆయన తెలిపారు. ఇరుప్రాంతాలకు న్యాయం చేయమని తమ పార్టీ కోరుతోందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. సీమాంధ్రలో అన్ని వర్గాలు వారు ఎవరికి వారు ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. నష్టపోతున్నందునే వారందరూ ఉద్యమ బాట పట్టారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజించడమేంటని ఆయన ప్రశ్నించారు.
16 నుంచి శిక్షణా శిబిరాలు: కడియం
నవంబర్ 16 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడామని, ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పార్టీ పాత్ర, 2014 ఎన్నికల కోసం కేడర్‌ను సిద్ధం చేసేందుకు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications