మంగళగిరిలో తమన్నా టార్గెట్ లోకేష్ బాబే .. ఏమందో తెలిస్తే షాక్

Recommended Video

    AP Assembly Election 2019 : మంగళగిరి నుంచి లోకేష్ కు పోటీగా తమన్నా ! | Oneindia Telugu

    తమన్నా ఎంట్రీ తో మంగళగిరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.మంత్రి, సీఎం కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుండి ఎన్నికల బరిలో ఉన్ననేపధ్యంలో తమన్నా లోకేష్ టార్గెట్ గా ఎన్నికల బరిలోకి దిగింది. మంత్రి నారా లోకేష్ పై ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు . నామినేషన్ల చివరి రోజైన మార్చి 25న ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. మంగళవారం అధికారులు ఆమె నామినేషన్‌ ను ఓకే చేశారు . దీంతో తమన్నా ఎన్నికల బరిలో నిలవటం పక్కా అయ్యింద్ . ఇక అంతలోనే మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయమని తమన్నా తన లక్ష్యం లోకేష్ ఓటమి అని చెప్పి సంచలనం సృష్టించారు.

     Tamanna targeted Lokesh in Mangalagiri assembly .. Shock if you know what she said

    తమన్నాకు లోకేష్ బాబే లక్ష్యం ... ఏపీ లో మంగళగిరి పై జనాల్లో ఆసక్తి

    లోకేష్ బాబు లక్ష్యంగా తమన్నా ఇక్కడి ఎన్నికలను ఎంతవరకు ప్రభావితం చేయగలరన్నది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికరంగా మారింది. అంతే కాదు లోకేష్ బాబుపై పోటీకి ఒక ట్రాన్స్ జెండర్ నిలబడటం పై స్థానికంగా జరుగుతున్న చర్చ మంత్రి లోకేష్ బాబును ఇబ్బందికి గురి చేస్తుంది. జనసేన టికెట్‌పై మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించిన తమన్నా ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో చివరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే మంగళగిరి ప్రజలకు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తానని చెబుతున్నారు.అంతే కాదు లోకేష్ బాబు టార్గెట్ గా ఒక సవాల్ కూడా విసిరారు .

     Tamanna targeted Lokesh in Mangalagiri assembly .. Shock if you know what she said

    లోకేష్ ఓటమి పక్కా ... గెలుస్తానన్న ధీమా ఉంటె ఎమ్మెల్సీగా రాజీనామా చెయ్ అంటున్న తమన్నా

    సోషల్ యాక్టివిస్ట్ గా ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. లోకేష్ కు గెలుపుపై అంత ధీమా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాల్సిందని అన్నారు.వైసీపీ అభ్యర్థిని గానీ , ఇతర పార్టీల నేతలను గానీ ఒక్క మాట కూడా అన్ని తమన్నా పాపం నారా లోకేష్ బాబుపై నామినేషన్ వేసే రోజు నుండే విరుచుకుపడుతున్నారు. వారసత్వ రాజకీయాలను ప్రజలు ఒప్పుకోకూడదని చెప్తున్నారు. మొత్తానికి తమన్నా ఎంట్రీ తో లోకేష్ బాబు కు పెద్ద చావొచ్చి పడింది . అసలే అంతంత పరిజ్ఞానంతో మాట్లాడే లోకేష్ బాబుకు ఇప్పుడు తమన్నా పెద్ద తలనొప్పిగా తయారైంది .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+