Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆపరేషన్ కుప్పం బిగిన్స్- వైఎస్ జగన్‌తో హీరో విశాల్ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- ఆపరేషన్ కుప్పం మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. వై నాట్ 175.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి అడుగు కుప్పంలోనే వేయబోతోంది. దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న కుప్పం నియోజకవర్గంపై వైసీపీ జెండాను ఎగరవేయాలనే పట్టుదలతో ఉన్న వైఎస్ జగన్- దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు.

మిగిలింది అదొక్కటే ఒక్కటే..

మిగిలింది అదొక్కటే ఒక్కటే..

ఇదివరకు వైఎస్ జగన్ అసెంబ్లీ నియోజవర్గాలవారీగా సమీక్షా సమావేశాలను కుప్పంతోనే ఆరంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడి నుంచే ఆయన తన పొలిటికల్ గేమ్‌ను మొదలు పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలో పంచాయతీ మొదలుకుని మున్సిపాలిటీ వరకు క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడింది. ఇక మిగిలింది ఎమ్మెల్యే ఒక్కటే. దాన్ని కూడా కొట్టి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు వైఎస్ జగన్.

కుప్పం ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా..

కుప్పం ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా..

ఈ క్రమంలో వైఎస్ జగన్ కొన్ని అనూహ్య నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఆయన తన వ్యూహాలను పన్నడం ఖాయంగా కనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గ పరిస్థితులు, అక్కడి వాతావరణానికి, ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటరు నాడి ఎలా ఉంటుందనే విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడిన నేపథ్యంలో అక్కడ అడుగు వేయనున్నారు.

వైసీపీ ప్లాన్ బీ..

వైసీపీ ప్లాన్ బీ..

ఈ క్రమంలో తమిళ హీరో విశాల్‌ను కుప్పంలో మోహరింపజేయొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. తొలుత వైఎస్ఆర్సీపీ తరఫున హీరో విశాల్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ- దాన్ని ఆయన తోసిపుచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో వైఎస్ జగన్‌‌ను తాను అభిమానిస్తానని విశాల్ స్పష్టం చేయడం వల్ల ఆయన సహాయాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో హీరో విశాల్‌ను దింపాలనేది ప్లాన్ బీగా కనిపిస్తోంది.

క్యాంప్ ఆఫీస్‌కు విశాల్..

క్యాంప్ ఆఫీస్‌కు విశాల్..

ఈ పరిణామాల మధ్య ఇవ్వాళ విశాల్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యాహ్నం ఆయన వైఎస్ జగన్‌ను కలుసుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ షెడ్యూల్ అయినట్లు తెలుస్తోంది. ఇది మర్యాదపూరక భేటీగానే చెబుతున్నప్పటికీ- రాజకీయ నేపథ్యం ఉండకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేలా విశాల్ సహకారాన్ని తీసుకోవడానికి ఇది తొలి అడుగుగా భావిస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+