జగన్ కు తమిళ హీరోల హాట్సాఫ్-స్టాలిన్ పై ఒత్తిడి : ఏపీ నిర్ణయమే అమలు చేయాలంటూ..!!
ఏపీ లో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పైన ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. కానీ, తమిళ హీరోల నుంచి మద్దతు వస్తోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీలో సినిమా టిక్కెట్లను ప్రభుత్వ విభాగమైన ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రైల్వే వెబ్ సైట్ తరహాలో ఒక వెబ్ సైట్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం ఎనిమిది మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసారు.

జగన్ నిర్ణయం పై టాలీవుడ్ గప్ చుప్
ఏపీలో కొత్త సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ల ధరలు పెంచటం..ప్రత్యేక షో లు నడపటం వంటివి ఎంతో కాలంగా కొనసాగుతోంది. అయితే, వకీల్ సాబ్ సినిమా సమయంలో ప్రభుత్వం ఈ తరహాల వ్యవహారానికి చెక్ పెట్టింది. టిక్కెట్ల ధరలు పెంచుకొనే అవకాశం పైన చర్చ చేసింది. ఫలితంగా అప్పటి వరకు జిల్లా జాయింట్ కలెక్టర్ల వద్ద సినిమా టిక్కెట్ల ధరల పెంపు..అదనపు షో ల నిర్వహణ వంటి నిర్ణయాలు ఇక, ప్రభుత్వ అనుమతి మేరకే జరగాలని ఆదేశించారు.

ప్రభుత్వ పరిధిలోకి మూవీ టిక్కెట్లు
ఇక, ఇప్పుడు తాజాగా సినిమా టిక్కెట్ల విషయంలోనూ ఒకే రకమైన ధరలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ధియేటర్ల కేటగిరీ వారీగా టిక్కెట్ల ధరలు అమలు కానున్నాయి. ఏ,బీ,సీ సెంటర్లు...అదే విధంగా సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీ ప్లెక్స్ ల వరకూ అన్నింటా ప్రభుత్వమే టిక్కెట్లు విక్రయించనుంది. ఇప్పటికే ఉన్న సినిమా టిక్కెట్ల యాప్ లు..వెబ్ సైట్లు కొంత గందరగోళంగా ఉన్నాయని..సాధారణ ప్రేక్షకులకు భారంగా ఉన్నాయనేది ప్రభుత్వ వాదన. దీంతో..ప్రభుత్వమే ఈ టిక్కెట్ల విక్రయం చేయటం ద్వారా ప్రజల పైన భారం తగ్గుతుంనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట.

టాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించలేదంటే
అయితే, ఇప్పటి వరకు సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రొడ్యూసర్లు-ఎగ్జిబిటర్లు-ధియేటర్ల యాజమన్యాలు చెప్పిన లెక్కలే ప్రభుత్వానికి చేరేవి. ఇక, టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ పరిధిలోకి వెళ్లటంతో అమ్మకాలు జరిపిన వాటి నుంచి ఏ రోజు లెక్కలు ఆ రోజునే సెటిల్ చేసి ప్రభుత్వ నిర్వహణా ఛార్జీలు మినహాయించి, మిగిలినవి సంబంధిత వ్యక్తులకు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం పైన మీడియాలో చర్చ జరుగుతున్నా...టాలీవుడ్ లోని ప్రముఖులు ఎవరూ మాత్రం స్పందించలేదు. అదే సమయంలో సమర్ధించ లేదు. వ్యతిరేకించ లేదు.

జగన్ కు తమిళ హీరో విశాల్ హాట్సాఫ్.. స్టాలిన్ కు సూచన
వీరి మౌనం కొనసాగుతుండగానే..తమిళ హీరో విశాల్ ఏపీ ప్రభుత్వ నిర్ణయం పైన స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాట్సాఫ్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ లైన్ టిక్కెట్ల విధానం తమిళనాడులో సైతం అమలు చేయాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇదే విషయాన్ని ట్యాగ్ చేస్తూ ఆ రాష్ట్రంలోనూ ఇదే తరహాలో ఆన్ లైన్ టిక్కెట్ల విధానం అమలు చేయాలని కోరారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినీ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

చిరంజీవి ద్వారా మంతనాలకు ప్రణాళికలు
తమిళ హీరోలు స్పందించినా..తెలుగు హీరోలు స్పందించకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే, సమర్ధిస్తే పరిశ్రమలో కొందరితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సమర్ధించకపోతే, ఈ నిర్ణయం అమలుతో జరిగే నష్టం ఏంటనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే, ఇప్పటికే కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమ..ఇతర సమస్యల పైన చిరంజీవి నాయకత్వంలో టాలీవుడ్ టీం సీఎం జగన్ ను కలిసింది.
పలు సమస్యల లను ప్రస్తావించింది .అందులో అనేక అంశాలను వారి సూచన మేరకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి చిరంజీవి సైతం ధన్యవాదాలు తెలిపారు. ఇక, మరో నాలుగు రోజుల్లో చిరంజీవి టీం మరో సారి సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఇతర సమస్యలతో పాటుగా ఈ అంశం పైనా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ, ఒక సారి నిర్ణయం తీసుకున్న తరువాత సీఎం జగన్ ఏ విషయం లోనూ వెనక్కు వెళ్లే సందర్బాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. దీంతో..ఇప్పుుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాల నిర్ణయం టాలీవుడ్ ప్రముఖులకు మింగుడ పడని అంశంగా మారింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications