పద్ధతి లేకుండా: బాబు ప్రభుత్వంపై సుప్రీంకు జయలలిత, మా కష్టాలివీ..
చెన్నై/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న డ్యాంల పైన తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం సోమవారం నాడు సుప్రీం కోర్టు గడప తొక్కింది. పాలార్ నది ప్రాంతంలో చెక్ డ్యాంలు, డ్యాంల ఎత్తు పెంచడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
డ్యాంల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ఆరోపిస్తోంది. ఇప్పటికే ఉన్న డ్యాంల ఎత్తును పెంచడం సరికాదని చెబుతోంది. అంతేకాకుండా, పాలార్ నది ఉన్న ప్రాంతంలో కొత్త డ్యాంలు నిర్మించడం అభ్యంతరకరమన్నారు. ఇది 1982 నాటి అగ్రిమెంటును ఉల్లంఘించడమే అంటున్నారు.

ఏపీ అలా ఇష్టారీతిన డ్యాంలు కడితే, ఎత్తు పెంచితే తమకు వ్యవసాయానికే కాకుండా, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయని చెబుతోంది. ఇష్టారీతిన డ్యాంలు కడితే తదుపరి తాగునీటికి కూడా పనికి రాకుండా ఆ నది పోతుందని చెబుతున్నారు.
ఇప్పటికే పాలార్ నదిలో నీటి తగ్గుదల కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో తక్కువ నీరు వచ్చిందని అంటున్నారు. కాగా, ఈ విషయమై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయినప్పటికీ డ్యాములు కట్టడం ఆగడం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications