కె.రాఘవేంద్రరావు, నాగబాబుకు గూస్ బంప్స్ ఇచ్చేలా షాక్!!

ఆర్ఆర్ఆర్‌కు అంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది.. ఇప్పుడు ఆస్కార్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.. ఆ డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయొచ్చు అని మాత్రమే చెప్పానన్నారు.

RRRపై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు-నిర్మాత నాగబాబు లాంటివారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ విద్యార్థులతో జరిగిన సెమినార్‌లో తాను మాట్లాడిన దాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, తాను ఆ స్థాయిలో స్పందించగలనని కానీ, తన తల్లిదండ్రులు తనను సంస్కారంతో పెంచారని విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. వారం కిందట రాజమౌళిని పొగుడుతూ ట్వీట్‌ చేస్తే, ఎవరూ స్పందించలేదని, ఇప్పుడు మాత్రం వివాదాస్పదం చేశారని మండిపడ్డారు. ఈ వివాదాన్ని తాను కొనసాగించదలచుకోలేదని స్పష్టత ఇచ్చారు.

గత వారం ఒక సదస్సు జరిగిందని, జాతీయ అవార్డు గ్రహీత 'మా బంగారు తల్లి' సినిమా దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌ దీనికి సమన్వయకర్తగా ఉన్నారు.. సినిమాపై ప్రేమ ఉన్న 20 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని, సినిమా ఎలా తీయాలన్న అంశంపై చర్చించారని తమ్మారెడ్డి చెప్పారు. చర్చలో భాగంగా సినిమాలు రెండు రకాలని, విడుదలైన తర్వాత పేరు తెచ్చేవి ఒకటైతే, పేరు కోసం తీసేవి ఉంటాయని అని మాట్లాడుకున్నాం అన్నారు. ఇవే కాకుండా అవార్డులు, రివార్డులు కోసం తీసే సినిమాల గురించి చెబుతుండగా, 'మా సినిమాలు థియేటర్‌లో విడుదలవుతాయా? అని ఒకరు అడిగారని, ఫెస్టివల్స్‌ కోసం తీసే సినిమాలని, అక్కడకు పంపడానికి చాలా ప్రాసెస్‌ ఉంటుంది. నాకు కూడా పూర్తిగా తెలియదు' అని చెప్పానన్నారు.

Tammareddy Bharadwaj reply to raghavendra rao and nagababu comments

ఈ మాటల సందర్భంలోనే 'RRR' గురించి ప్రస్తావన వచ్చి 'అవార్డు వస్తుందా' అని విద్యార్థులు అడిగారని, మాటల్లో దాని గురించి చెబుతూ ఆర్ఆర్ఆర్‌కు అంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది.. ఇప్పుడు ఆస్కార్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.. ఆ డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయొచ్చు అని మాత్రమే చెప్పానన్నారు. అవార్డుల కోసం తీసే సినిమాలకు అంత డబ్బు ఖర్చు పెట్టి చేయలేం కాబట్టి, ప్రయత్నించవచ్చు అని విద్యార్థులకు సూచించానని తమ్మారెడ్డి చెప్పారు.
తానేదైనా తప్పు మాట్లాడివుంటే ఫీలై చెప్పవచ్చని, కానీ తనకు సంస్కారం ఉందని, తానేమీ గుర్తింపు కోసం పాకులాడటంలేదని, ఈ వివాదాన్ని కొనసాగించే ఉద్దేశం తనకు లేదన్నారు. సినిమా గురించి రెండున్నర గంటలు మాట్లాడితే ఒక నిముషం క్లిప్పింగ్ తీసుకొని ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+