Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్షీణిస్తున్న తారకరత్న ఆరోగ్యం? నందమూరి ఫ్యామిలీ, ఫ్యాన్స్ లో ఆందోళన!!

నందమూరి తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టు కనిపిస్తుంది. నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యకపోవటం ఆందోళన కలిగిస్తుంది.

నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, నందమూరి కుటుంబంలోనూ, నందమూరి అభిమానుల లోను ఇంకా ఆందోళనకు కారణంగానే మారింది. ఇప్పటివరకు నందమూరి తారకరత్న కోలుకోకపోవడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఇక తాజాగా నటుడు తారకరత్న ఆరోగ్యం క్షీణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంతో వైద్యులు చెప్పాల్సి ఉంది.

తారకరత్న ఆరోగ్యం క్షీణిస్తుందా?

తారకరత్న ఆరోగ్యం క్షీణిస్తుందా?

ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తుందని పేర్కొన్న వైద్యులు, విదేశీ వైద్యులను పిలిపించి మరీ ఆయనకు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. తారకరత్నకు సుమారు రెండు వారాలుగా ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యులు ఇటీవల స్పెషల్ ట్రీట్మెంట్ ను విదేశీ వైద్యులతో మొదలుపెట్టారు.

విదేశీ వైద్యులను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి పిలిపించి తారకరత్నకు గుండె సహా మెదడుకు సంబంధించిన సంబంధించిన స్పెషల్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు అన్న వార్తలు వచ్చిన క్రమంలో ఆయన ఆరోగ్యం కోలుకుంటుంది అనుకుంటే అందుకు భిన్నంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది.

హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యని ఆస్పత్రి వైద్యులు

హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యని ఆస్పత్రి వైద్యులు

కోమాలో ఉన్న తారకరత్నను స్పృహలోకి తీసుకురావడానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం. నేడు వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని అంతా భావిస్తే, ఇప్పటివరకు వైద్యులు హెల్త్ బులిటెన్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు.

రేపు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారేమో అని భావిస్తున్నారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. బాలకృష్ణ బెంగళూరులోనే ఉంటే ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది.

నోరు మెదపని కుటుంబ సభ్యులు.. ఆయన సేఫ్ గానే ఉన్నారా?

నోరు మెదపని కుటుంబ సభ్యులు.. ఆయన సేఫ్ గానే ఉన్నారా?

అయితే ఇప్పటివరకు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్న దానిపై నారాయణ హృదయాలయ వైద్యులు కూడా ఏ విషయము చెప్పకపోవడంతో ఆందోళన కనిపిస్తుంది. ఇక తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేయడం లేదు. బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో తారకరత్న ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.

తారకరత్న కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. భార్య అలేఖ్య రెడ్డి తో పాటు, మరి కొంతమంది కుటుంబ సభ్యుల ఆసుపత్రిలో ఉన్నప్పటికీ వారెవరు నోరు మెదపడం లేదు. దీంతో తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన సేఫ్ గానే ఉన్నారా? లేదా ఇంకా ఆయన పరిస్థితి విషమంగానే ఉందా? అన్న ఆందోళన కలుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+