ఎన్నికల వేళ విజయసాయిరెడ్డిపై తారకరత్న భార్య కీలక వ్యాఖ్యలు
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి భర్త మరణాన్ని నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ హీరోగా,తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారక రత్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు.నందమూరి వారసుడిగా అందరి మన్ననలను చూరగొన్న నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణిస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఆయన మృతి చెందారు.
టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మొదటి రోజునే తారకరత్నకు గుండె పోటు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన కొద్ది రోజులకే మృతి చెందారు. ఇదిలా ఉంటే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి వైసీనీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర బంధువు అవుతారనే విషయం అందరికి తెలిసిందే. తారకరత్న మరణించిన సమయంలో వారి కుటుంబానికి విజయసాయిరెడ్డి అండగా నిలిచారు.

ఈ ఘటన తరువాత కూడా తారకరత్న ఫ్యామిలీకి ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా జీవితంలో నాన్నలాంటి గొప్పవ్యక్తి విజయసాయిరెడ్డి అంకుల్..ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని అలేఖ్య రెడ్డి చెప్పుకొచ్చారు.మా కష్టసుఖాల్లో మాతోనే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఆమె తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కూడా మాకోసం విజయసాయిరెడ్డి స్పెషల్‌గా రావడాన్ని మించిన సంతోషం మరొకటి లేదని అలేఖ్యారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసని అలేఖ్య రెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి ఉగాది పండుగను అలేఖ్య రెడ్డి ఇంట్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగానే ఆమె ఆయన్ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications