ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్!!

నందమూరి తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి తారకరత్న మరణాన్ని నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ హీరో గా,తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారక రత్న తెలుగు ప్రజలందరికీ చిరపరిచితులు.నందమూరి వారసుడిగా అందరి మన్ననలను చూరగొన్న నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణిస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఆయన మృత్యువు చెంతకు చేరిపోయారు.

నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో కార్డియాక్ అరెస్ట్ కు గురైనా తారక రత్న మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18వ తేదీన మరణించారు. అప్పటివరకూ మౌనంగా ఉన్న అలేఖ్య రెడ్డి, తారకరత్న మరణం తర్వాత వారి ప్రేమ వివాహం, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఎమోషనల్ పోస్టులను సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. తద్వారా తారకరత్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె తన పోస్టులలో వెల్లడిస్తున్నారు.

Tarakaratna

ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరో పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి తన భర్త తారకరత్నతో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేస్తూ ఈ జీవితానికి ఇక నువ్వు నేను మాత్రమే..జీవితానికి సరిపడా జ్ఞాపకాలని ఇచ్చి వెళ్లావు. వాటితో నేను ముందుకు వెళ్తాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Tarakaratna

అంతేకాదు మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోలు, తన కుమారుడి ఫోటోలు షేర్ చేసి వీళ్ళే తన స్టార్స్ అంటూ అలేఖ్య రెడ్డి పేర్కొంది.నిత్యం తారక రత్నకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న అలేఖ్య రెడ్డి ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పడానికి ఆమె చేస్తున్న పోస్టులే నిదర్శనం. తారకరత్న తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె చెబుతున్న తీరు నెటిజన్లను ఆలోచించేలా చేస్తోంది.

ఆమె మనసులోని బాధను అందరికీ అర్థమయ్యేలా చెబుతోంది. తారకరత్న చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపించడం లేదు.నిత్యం భర్త జ్ఞాపకాలతో అలేఖ్య రెడ్డి బాధ పడుతూనే ఉంది. అయితే ఆమెను తారకరత్న మృతి బాధ నుండి బయటకు తీసుకురావాలని, రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా చూడాలని, తారకరత్న ఆశయం అలేఖ్యా రెడ్డి ద్వారా నెరవేర్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు సమాచారం .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+