Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనకాపల్లి వద్ద ఘోర రైలు ప్రమాదం- బోగీలు బుగ్గి

ఏపీలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్లే 18189 నంబర్ టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యలమంచలి వద్ద మిడ్ నైట్ ప్యాంట్రీ కారు వెంట ఉండే బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. తొలుత దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. క్షణాల్లో వ్యాపించాయి.

మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలెట్ అప్రమత్తం అయ్యారు. రైలును స్టేషన్ లో నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపే ఈ రెండు బోగీలు కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయాయంటే అవి ఎంత వేగంగా వ్యాప్తి చెందాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి గల కారణాల గురించి అధికారులు ఆరా తీస్తోన్నారు. బ్రేకులు వేడెక్కడమే దీనికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.

Tatanagar Ernakulam Eexpress catches fire in Andhra Pradesh

ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు సమాచారం అందింది. విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్‌ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన B1 ఏసీ బోగీలో చిక్కుకుని తీవ్ర కాలిన గాయాలతో మరణించినట్లు చెబుతున్నారు. దీన్ని అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 1:11 గంటల ప్రాంతంలో జరిగిందని రైల్వే వర్గాలు తెలిపాయి. మంటలను గుర్తించిన వెంటనే, రైల్వే అధికారులు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు.

సీనియర్ రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలను రైలు నుంచి వెంటనే వేరు చేశారు. ప్రమాద కారణాలు, వాస్తవ ప్రాణనష్టంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని దక్షిణమధ్య రైల్వే వివరించింది. ముందుజాగ్రత్తగా అంబులెన్సులు సిద్ధం చేశామని తెలిపింది.

యలమంచిలికి సమీపంలోని రైల్వే పాయింట్ దగ్గర లోకో పైలట్లు ఈ సంఘటనను మొదట గమనించారని, ఆ తర్వాత రైలును వెంటనే స్టేషన్‌లో నిలిపివేసారని రైల్వే పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బోగీల్లో దట్టమైన పొగలు నిండిపోవడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ప్లాట్‌ఫామ్‌పైకి పరుగులు తీశారు. ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగ కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

రాత్రివేళ చలిలో వందలాది మంది ప్రయాణికులు స్టేషన్‌లో గంటల తరబడి వేచి ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల విశాఖపట్నం-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున 3:30 గంటల తర్వాత అధికారులు దహనమైన బోగీలను వేరు చేశారు. ప్రయాణికులను మిగిలిన కంపార్ట్‌మెంట్‌లలోకి తరలించారు. ఈ క్రమంలో రైలు సుమారు నాలుగు గంటలు ఆలస్యంగా అనకాపల్లికి చేరుకుంది.

ప్రభావిత ప్రయాణికులను మూడు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులలో సామర్లకోటకు తరలించారు. అక్కడ రైలుకు రెండు కొత్త ఏసీ బోగీలను అమర్చిన తర్వాత టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ ఘటన వల్ల విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించబడే వరకు విశాఖపట్నం, అనకాపల్లి, తునిలలో అనేక రైళ్లను నిలిపివేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు దక్షిణ మధ్య రైల్వే ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+