చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి .. వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతి

చాలా మంది అభిమానులు తమ అభిమాన నేతపై తమకున్న ప్రేమను , అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తారు. తమ అభిమాన నాయకుడు వస్తున్నారు అంటే చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఊరంతా బ్యానర్లు వేస్తారు. ఏ కార్యక్రమం నిర్వహించ తలపెట్టారో ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడతారు. తన అభిమానం వ్యక్తం చెయ్యటానికి పలు రూపాల్లో ప్రయత్నం చేస్తుంటారు. కానీ చంద్రబాబు విషయంలో ఆయనపై విపరీతమైన అభిమానం ఉన్న ఓ కార్యకర్త ఏం చేసాడో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి ఇచ్చారు .ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు పని చేస్తున్న చంద్రబాబు వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతి ఇచ్చారు ఓ అభిమాన కార్యకర్త. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముందు పాలించే చంద్రబాబు ఆరోగ్యం ఉండాలని భావించే ఎవరూ ఊహించని ప్రత్యేకమైన బహుమతిని చంద్రబాబుకి ఇచ్చారు .

TDP activist gave a surprising gift to CM Chandrababu .. This is the gift to take diet timely

రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారని, ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని భావించిన ఓ కార్యకర్త అధినేతకు ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త రామానుజం చలపతి గడియారం, లంచ్ బాక్స్‌ను బహుమతిగా ఇచ్చారు . వేళకు భోజనం చేయాలనే ఈ రెండింటినీ బహుమతిగా ఇచ్చినట్టు చలపతి పేర్కొన్నాడు. తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్న కార్యకర్త చలపతిని చంద్రబాబు అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+