కేసులను తేల్చాలని చెప్పగానే కలిసిన జగన్, మోడీపై టిడిపి ఆగ్రహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనపై మాట్లాడే హక్కు వైసిపి అధనేత జగన్‌కు లేదని టిడిపి నేత రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనపై మాట్లాడే హక్కు వైసిపి అధనేత జగన్‌కు లేదని టిడిపి నేత రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అలాగే జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఈడీ, సీబీఐ కోర్టుల్లో 12 ఛార్జీషీట్లు నమోదైన ఆర్థిక ఉగ్రవాది జగన్‌కు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం చాలా దురదృష్ణకరమన్నారు. ఈ కేసుల వల్లే ప్రధాని నరేంద్ర మోడీని జగన్ కలిశారని ఆరోపించారు. ఆర్థిక ఉగ్రవాది కలుస్తానంటే ఓకే చెప్పడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని శరణు కోరాడంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని శరణు కోరాడంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

ఆ రోజు తల్లి విజయమ్మ..
గతంలో జగన్ తల్లి విజయమ్మ కూడా రాష్ట్రపతి ప్రణబ్‌ను ఈ కేసుల విషయమై కలిశారన్నారు. బయటకు వచ్చిన తర్వాత రైతు సమస్యలపై కలిశానని చెప్పారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు జగన్
వాళ్ల అమ్మ మాదిరిగానే జగన్ కూడా మిర్చి రైతులు, అగ్రిగోల్ బాధితులు, ప్రత్యేక హోదా సమస్యల గురించి ప్రధానికి చెప్పానంటూ బయటకు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కానీ కలిసింది కేసుల గురించి అన్నారు.

చంద్రబాబును అలా అంటారా
ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనపై మాట్లాడే నైతికత కూడా జగన్ కు లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎండల వేడి నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు అమెరికా వెళ్లారంటూ జగన్ మాట్లాడటం అతని బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications