నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్ధి ఖరారు-లోకేష్ పాదయాత్ర బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పది పది సీట్లు ఇచ్చిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి పార్టీ విప్ ను ధిక్కరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటేశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఈ ముగ్గురిని సస్పెండ్ చేసింది. దీంతో వీరంతా టీడీపీకి దగ్గరవుతున్నారు. అయితే జిల్లాలో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలకు ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వరుసగా క్లారిటీలు ఇస్తున్నారు.
ఇవాళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తో పాటు వైసీపీ బహిష్కత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చించారు. చివరికి నెల్లూరు రూరల్ సీటు నుంచి కోటంరెడ్డినే బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సీటును త్యాగం చేస్తున్న అజీజ్ కు భవిష్యత్తులో న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వాస్తవానికి వైసీపీ బహిష్కరణ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అప్పటికే ఇన్ ఛార్జ్ గా ఉన్న అబ్దుల్ అజీజ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కోటంరెడ్డి చేరిక కూడా ఆలస్యమైంది. కానీ ఎన్నికలు దగ్గరపడుతుండటం, లోకేష్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో చంద్రబాబు ఇద్దరు నేతల్ని పిలిపించి మాట్లాడారు. అనంతరం కోటంరెడ్డిని లోకేష్ పాదయాత్ర బాధ్యతలు సమన్వయం చేసే బాధ్యత అప్పగించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డికి ఈ బాధ్యత అప్పగించారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి అభ్యర్ధిత్వం ఖరారుతో టీడీపీ మొత్తం మూడు సీట్లను ఖరారు చేసినట్లయింది. ఇప్పటికే నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణను మరోసారి బరిలోకి దింపాలని నిర్ణయించిన చంద్రబాబు, ఆత్మకూరు నుంచి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పోటీ చేయించాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు రూరల్ నుంచి కోటంరెడ్డి పేరు కూడా ఖరారు కావడంతో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఖరారు అయినట్లయింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications