రాజమండ్రి జైలుకు చంద్రబాబు - కీలక పరిణామాలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలొ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంట నష్టం ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రైతుల కష్టాలు తీరే వరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చివరి బస్తా కొనేదాకా పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. అయిదు రోజుల పాటు రాజమహేంద్రవరంలోనే ఉండాలని నిర్ణయించారు.
గోదావరిలో చంద్రబాబు : గోదావరి జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న చంద్రబాబు పర్యటన షెడ్యూల్ మారింది. రైతుల పక్షాన టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు ప్రకటించారు. వర్షాలతో దెబ్బతిన్న అన్నదాతకు అండగా నిలబడేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. గోదావరి జిల్లాల పార్టీ నియోజకవర్గ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

అవసరమైతే అయిదు రోజుల పాటు రాజమహేంద్రవరంలోనే బస చేసి రైతులు ఇబ్బంది పడుతున్న ప్రతీ ప్రాంతానికి వెళ్తానని ప్రకటించారు. తాను ఏ ప్రాంతంలో పర్యటిస్తుంటే అక్కడ ధాన్యాన్ని యంత్రాంగం హాడావుడిగా కొనగోలు చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతీ ధాన్యం గింజా కొనుగోలు చేసే వరకూ పోరాటం చేయాలని నిర్ణయించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు : అటు చంద్రబాబు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను పరామర్శించనున్నారు. జగజ్జననీ చిట్ ఫండ ప్రైవేటు లిమిటెడ వ్యవహారానికి సంబంధించి సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. వీరిద్దరూ ప్రస్తుతం జిల్లా కారాగారంలో ఉన్నారు.
ఇద్దర్నీ విచారించాల్సి ఉందని సీఐడీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజు కోర్టులో విచారణ తరువాత బెయిల్ పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ బదిలీ వ్యవహారం రాజకీయ చర్చకు దారి తీసింది. జైలులో చంద్రబాబు పార్టీ నేతలను పరామర్శించిన తరువాత ఈ అంశం పైనా స్పందించే అవకాశం ఉంది.

టీడీపీ నేతలకు పరామర్శ : ఇటు కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కూడా చంద్రబాబు పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీడీపీ అధినేత పర్యటించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. రెండో రోజు రామచంద్రపురంలో పర్యటించనున్న చంద్రబాబు పంట నష్టం ప్రాంతాలను పరిశీలించనున్నారు. అయితే పొలాల్లోకి వెళ్లనీయకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం మండలం వెగాయమ్మపేటలో పంట నష్టం పరిశీలించడానికి వెళ్లాలని బాబు షెడ్యూల్‌లో నిర్ణయించారు. తీరా అక్కడకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన చంద్రబాబు... అవసరమైతే నడుచుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications