వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సంచలన కామెంట్స్: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం రాజీనామాలు: జగన్ దమ్ముందా..?

By Lekhaka
|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలో పెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించటం..అక్కడి నుంచే త్వరితగతని పాలన చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో విశాఖలోనే రాజకీయంగా బలం పెంచకోవటానికి చంద్రబాబుు పావులు కదుపుతున్నారు. విశాఖ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

 రాజీనామాలకు అందరం సిద్దం..

రాజీనామాలకు అందరం సిద్దం..

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో తెలుగు ప్రజలు స్టీల్ ప్లాంట్‌ను సాధించారన్నారు. దీనికి కొనసాగింపుగా... విశాఖ ఉక్కు కోసం టీడీపీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులంతా రాజీనామాకు సిద్దమంటూ లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఎన్నో ఆవరోధాలను అధిగమించి 1992లో స్టీల్ ప్లాంట్ పూర్తియిందని గుర్తు చేసారు. 2000 సంవత్సరంలో రూ.4వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడిందని ..ఆ సమయంలో,. తన అభ్యర్థన.. ప్రభుత్వ విజ్ఞప్తితో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని చంద్రబాబు వివరించారు.

జగన్ నాయకత్వం వహించాలి..

జగన్ నాయకత్వం వహించాలి..

విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం జగన్ నేతృత్వం వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించడం ఎంతో అవసరమన్నారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలు మార్లు స్టీల్ ప్లాంట్ లో వంద శాతం ప్రయివేటీకరణ జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..కేంద్రం అదే నిర్ణయంతో ఉందంటూ మరోసారి తేల్చి చెప్పింది.

జగన్ అభ్యర్ధించినా ..నో రెస్పాన్స్

జగన్ అభ్యర్ధించినా ..నో రెస్పాన్స్

గతంలో సీఎం జగన్ ప్రధాని..కేంద్ర ఉక్కు శాఖా మంత్రికి లేఖలు రాసారు. కేంద్రం ప్లాంట్ ను ప్రయివేటీకరించకుండా..ఏ రకంగా నిలబెట్టుకోవచ్చో వివరించారు. ఈ అంశం పైన అఖిల పక్ష నేతలతో వస్తామని..అందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఢిల్లీ పర్యటనలో అప్పటి ఉక్కు శాఖా మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ను కలిసి నేరుగా కోరారు. కానీ, కేంద్రం ఎక్కడా వెనక్కు తగ్గినట్లు కనిపించటం లేదు. అసెంబ్లీలోనూ విశాఖ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేసారు.

Recommended Video

Revanth Reddy వెనుక Chandrababu | Komatireddy | YS Sharmila | TPCC | Oneindia Telugu
 జగన్ ను ఇరకాటంలో పెట్టే వ్యూహం..

జగన్ ను ఇరకాటంలో పెట్టే వ్యూహం..

ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ రెండు సభల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల అంశం పైన ఆందోళన చేస్తున్నారు. దీంతో..రాజకీయంగా సీఎం జగన్ పైన ఒత్తిడి పెంచటానికి ఇదే సరైన సమయంగా భావించిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అంశంలో కీలక ప్రతిపాదన చేసారు. గతంలో విశాఖ పర్యటనలోనూ ఈ అంశం ప్రస్తావించినా..ఇప్పుడు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇప్పటికే టీడీపీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాస రావు స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అది పెండింగ్ లో ఉంది.


ఇప్పుడు చంద్రబాబు చేసిన తాజా ప్రతిపాదన పైన వైసీపీ నుంచి స్పందన రావాల్సి ఉంది. అదే విధంగా.. రాజీనామాలు చేస్తే ప్రయివేటీకరణ ఆగుతుందంటే తామంతా ముందుంటామని గతంలోనే విశాఖ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. మరి, ఇప్పుడు సీఎం జగన్ మందుండి నడిపిస్తే..తాము అనుసరిస్తామంటూ చంద్రబాబు లేఖ రాయటంతో..టీడీపీ దీనిని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. మరి..దీని పైన సీఎం జగన్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

English summary
AP opposition leader Chandrababu had written a letter extending his support to the Vizag steel plant workers and demands his party leaders are ready to tender resignation and asks CM Jagan to do the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X