కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డైలాగుల మేనమామ... మాస్ మహారాజా.. చంద్రబాబునాయుడు!!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ అంటూ సవాల్ విసురుతున్నారు. అంతేకాదు తన ప్రసంగాలలో వేడిని పెంచారు. గతంలో ఎక్కడా మాట తూలకుండా, జాగ్రత్తగా, గౌరవంగా, ఆచితూచి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు తన సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరించడమేకాదు.. మాటలు కూడా మార్చేశారు. అప్పటి వరకు క్లాస్ గా ఉన్న చంద్రబాబు ఇప్పుడు 'మాస్ మహారాజా' చంద్రబాబుగా మారిపోయారు.

తాట తీస్తా.. చవట దద్దమ్మల్లారా?

తాట తీస్తా.. చవట దద్దమ్మల్లారా?

ఇటీవలి కాలం నుంచి తన మాట తీరు మార్చుకున్న బాబు తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో మరింత పదునుగా మాట్లాడారు. తాట తీస్తా, చవట దద్దమ్మల్లారా అంటూ వ్యాఖ్యానించారు. తనతో రాజకీయంగా గొడవపడాలనే కోరిక ఉంటే "నువ్వు ఉంటావా లేక నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నావా? మీరు అనర్హులు, క్రూరమైన నేరస్థులు! రండి, పోట్లాడుకుందాం" అంటూ రాయలసీమ జేఏసీ సభ్యులపై తీవ్రంగా స్పందించారు."ఆ దొంగలను పట్టుకుని, వారిని నిలదీయండి.. అవసరమైతే రాత్రికి రాత్రే ఇక్కడే నిలబడి నీ అంతు చూస్తాను"అంటూ మాట్లాడేసరికి ప్రజల్లో నుంచి ఈలలు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్‌ను రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు.

పక్కా మాస్ గా చంద్రబాబు

పక్కా మాస్ గా చంద్రబాబు


ఇటీవలి కాలంలో జరుగుతున్న సభలు, సమావేశాల్లో తమ నేత చంద్రబాబు ప్రసంగిస్తున్న విధానంకానీ, మాటలు కానీ పక్కా మాస్ గా ఉంటున్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఎలా మాట్లాడితే వారికి కూడా అలాగే బదులివ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యూహాన్ని మార్చారని చెబుతున్నారు. ఇంతకుముందు చంద్రబాబు సాధారణంగా, గౌరవప్రదంగా మాట్లాడేవారని, కానీ వైసీపీకి తీవ్రంగా బదులివ్వడంతోపాటు శ్రేణుల్లో జోష్ ను తెచ్చేందుకు మాటతీరును మార్చుకున్నారని చెబుతున్నారు.

వారికి అర్థమయ్యేందుకే పరుష పదజాలం

వారికి అర్థమయ్యేందుకే పరుష పదజాలం


గతంలో ఎవరినీ విమర్శించకుండా, మాట తూలకుండా జాగ్రత్తగా మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు మాటల తూటాలు పేలుస్తున్నారు. తన మనసు అంగీకరించకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులకు అర్థం కావాలంటే బూతుపురాణం మాట్లాడాలని, అలా మాట్లాడితేనే అర్థ‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో తన నోటివెంట ప‌రుష ప‌ద‌జాలం వ‌స్తోందని బాబు వెల్లడించారు.

English summary
Telugu Desam Party leader Chandrababu Naidu is throwing a challenge saying any center, single hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X