కుప్పంలో వందేభారత్ రైలు ఆపండి- రైల్వే మంత్రికి చంద్రబాబు లేఖ

ఇవాళ ప్రధాని మోడీ బెంగళూరులో మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇది ఏపీలోని కుప్పం మీదుగా ప్రయాణించబోతోంది. కానీ కుప్పంలో స్టాప్ మాత్రం లేదు. దీంతో ఈ రైలుకు కుప్పంలో స్టాప్ ఇవ్వాలని కోరుతూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు స్ధానిక ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు స్టాప్ కోరుతూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు రాసిన లేఖను పార్టీ నేతలు అధికారులకు అందజేశారు. ఈ లేఖలో చంద్రబాబు కుప్పంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆపాల్సిన అవసరాన్ని రైల్వేమంత్రికి తెలిపారు. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కుప్పంకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని స్టాప్ ఇవ్వాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. దీంతో చంద్రబాబు లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

tdp chief chandrababu request railway minister to stop vande bharat express in kuppam

చంద్రబాబు రాసిన లేఖను వందేభారత్ రైలు చీఫ్‌ కమర్షియల్ మేనేజర్‌కు టీడీపీ నేతలు ఇవాళ అందజేశారు. ద్రావిడ వర్సిటీ, పీఈఎస్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు నిత్యం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారని, కుప్పంలో రైలు ఆగితే అందరికీ ఉపయోగమని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. కాబట్టి వెంటనే స్పందించి కుప్పంలో వందే భారత్ రైలుకు స్టాప్ ఇవ్వాలని చంద్రబాబు రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఇవాళ ప్రధాని ప్రారంభించిన మైసూరు-చెన్నై వందే భారత్ రైలు దక్షిణాదిలో ప్రారంభించిన తొలి వందే భారత్ రైలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+