వైఎస్ జగన్ కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్న సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వానికీ, తమ ప్రభుత్వానికీ మధ్య తేడాను అధికార పార్టీ పదే పదే చెబుతోంది. జనాల్లోకి కూడా ఇదే విషయం తీసుకెళ్లాలని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. దీంతో జగన్ ప్లాన్ కు కౌంటర్ గా టీడీపీ నేతలు తమ ప్రభుత్వంలో చేసిన మంచి పనుల ఫొటోలు తీసి వాటితో సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు.
ఇదే క్రమంలో ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేష్.. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమల దగ్గర ఫొటోలు తీసుకుని వైరల్ చేస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇప్పుడు అదే క్రమంలో చంద్రబాబు సైతం ఇవాళ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఓ పథకం వద్దకు వెళ్లి అక్కడ ఫొటోలు తీసుకుని సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తాజాగా టీడీపీ వైజాగ్ జోనల్ సమావేశంలోనూ పార్టీ నేతలు ఇదే పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇప్పుడు నెల్లూరు జిల్లాలో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్ కు దీంతో సెల్ఫీ సవాల్ విసిరారు. చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరు లో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..నువ్వు కట్టిన ఇళ్లెక్కడ...జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటో తో చంద్రబాబు ట్వీట్ చేశారు.
చూడు... @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2023
ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?#SelfieChallengeToJagan pic.twitter.com/1yoMGd4yf9
చంద్రబాబు తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్ కు, లీడర్స్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత.. ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగి సెల్ఫీ ఛాలెంజ్ విసరడంతో క్యాడర్ కూడా దాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications