పవన్ వ్యాఖ్యలతో చంద్రబాబు అలర్ట్ - కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు వేళ పవన్ వ్యాఖ్యలతో కలకలం మొదలైంది. టీడీపీ సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నా..క్షేత్ర స్థాయిలో మాత్రం పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు కార్యాచరణ ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. నేటి నుంచి చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వెళ్తున్నారు. పవన్ వ్యాఖ్యల పైన చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.
చంద్రబాబు పర్యటనలు: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు నుంచి తిరిగి రా..కదలిరా పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు. చంద్రబాబు అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లడంతో పాటు తిరిగి వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఆరు జిల్లాల్లో వరుసగా చంద్రబాబు పర్యటనలు ఖరారయ్యాయి.

నేడు పీలేరు, ఉరవకొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొనున్నారు. తాజాగా సీట్ల విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది. టీడీపీ తనతో సంప్రదించుకుండా అరకు, మండపేట సీట్లను ప్రకటించటం పైన పవన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇందుకు ప్రతిగా రాజోలు, రాజానగరం సీట్లను పవన్ ప్రకటించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత పొత్తు ధర్మం పాటించటం లేదని వ్యాఖ్యానించారు.
పవన్ వ్యాఖ్యలతో: పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అలర్ట్ అయింది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ రెండు సీట్లు ప్రకటించడం వల్ల తమకు ఇబ్బంది లేదని అన్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు-పవన్ కూర్చుని మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాజానగరం, రాజోలు నుంచి టీడీపీ సీనియర్లు సీట్లు ఆశిస్తున్నారు.
ఏ రకంగా పవన్ వ్యాఖ్యల పైన స్పందించవద్దని పార్టీ నాయకత్వం ఆదేశించింది. దీంతో ఈ రోజు రాజోలు నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సమావేశం కానున్నారు. సీట్ల ఖరారు పైన పార్టీ నేతలు ఎవరూ స్పందించవద్దని ఇప్పటికే ముఖ్య నేతలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

చంద్రబాబు స్పందిస్తారా: ఈ సమయంలోనే చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పవన్ కల్యాణ్ తాజాగా తనకు సీఎం పదవి షేరింగ్ గురించి లోకేష్ వ్యాఖ్యలు చేసినా స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఒక విధంగా టీడీపీ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాను మిత్రపక్షంగా ఉంటూనే తన నిర్ణయాలు తీసుకుంటాననే విధంగా పవన్ సంకేతాలు ఇచ్చారు.
దీంతో, చంద్రబాబు ఈ వివాదానికి బహిరంగ సభల ద్వారా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపడతారా లేదా అనేది చర్చ మొదలైంది. పవన్ వ్యాఖ్యల పైన చంద్రబాబు పార్టీ కేడర్ కు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, చంద్రబాబు ఏం చెప్పబోతున్నారనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications