పవన్ తో చంద్రబాబు భేటీ-విజయవాడ నోవోటెల్ హోటల్లో-వైజాగ్ ఘటనలపై ఆరా..
వైజాగ్ లో రాజధానుల పోరు నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనల తర్వాత విజయవాడ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో బసచేసిన పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు స్వయంగా వచ్చి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

వైజాగ్ లో మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పెట్టిన విశాఖ గర్జనకు వైసీపీ మద్దతివ్వడం, అనంతరం విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసేన నేతల దాడి నేపథ్యంలో చంద్రబాబు, పవన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో చోటు చేసుకున్న పరిణామాలు, జనసేన నేతలపై కేసులపై చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ వైజాగ్ లో ఉండగానే ఆయనతో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన చంద్రబాబు.. ఇవాళ స్వయంగా కలిసి మాట్లాడారు.













Click it and Unblock the Notifications