Chandrababu New Convoy : చంద్రబాబు కొత్త కాన్వాయ్ పై టీడీపీ క్లారిటీ ఇదే..!
ఏపీలో నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన కాన్వాయ్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయన కాన్వాయ్ లో కొత్త టయోటా వాహనాలు చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకూ టాటా సఫారీ వాహనాలు వాడుతున్న చంద్రబాబు వాటి స్ధానంలో కొత్తగా టయోటా ఫార్చూనర్ వాహనాలు సమకూర్చుకుంటున్నట్లు ఈ వార్తల సారాంశం. అయితే వీటిని టీడీపీ తోసిపుచ్చింది.
చంద్రబాబు కాన్వాయ్ లో కొత్తగా వాహనాలు చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై తెలుగుదేశం పార్టీ ఇవాళ స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారని పేర్కొంది. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలన్నీ పాత వాహనాలే. ఎప్పటి నుండో వినియోగిస్తున్నవే అని వారు స్పష్టం చేశారని తెలిపింది.

Fake News Alert : ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారు. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలన్నీ పాత వాహనాలే. ఎప్పటి నుండో… pic.twitter.com/o7fbMh10CF
— Telugu Desam Party (@JaiTDP) June 10, 2024
అయితే ఇంతకీ చంద్రబాబు కొత్త కాన్వాయ్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన వాహనాల సంగతేంటని ఆరా తీస్తే అవి గతంలో సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ వాడిన వాహనాలను తెలుస్తోంది. జగన్ కంటే ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు టాటా సఫారీ వాహనాలను ఉపయోగిస్తే జగన్ వచ్చాక మాత్రం టయోటా ఫార్చూనర్ వాహనాలను కొనుగోలు చేసారు. వాటి కోసం భారీగా ఖర్చు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడంతో అవి మూలనపడుతున్నాయి.












Click it and Unblock the Notifications