నా పార్టీ తెలుగుదేశం.. అందులో నోడౌట్!!
తాను దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కొనసాగిన సమయంలో తనను అభిమానించిన వాళ్లు, తనకు అండగా నిలిచినవాళ్లు చాలామంది ఉన్నారన్నారు.
తెలుగుదేశం పార్టీకి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగిన పమిడి రమేష్ అకస్మాత్తుగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలను వైసీపీ గెలుచుకోగా దర్శి మాత్రం టీడీపీ పరమైంది. ఈ విజయం వెనక పమిడి రమేష్ కృషి ఉంది. అటువంటి వ్యక్తి పదవి నుంచి తప్పుకోవడంతో ఇన్ ఛార్జిగా ఎవరినీ నియమించలేదు. ఇటీవలే ఆయన జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ను కలవడంతో జనసేనలోకి వెళుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే రమేష్ ఆ వార్తలను ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్పష్టత ఇచ్చారు.

కేవలం నా అభిప్రాయాన్ని తెలియజేశాను..
తన పార్టీ తెలుగుదేశమేనని, టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని, దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ కు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి ఒకరు తనను కలిసి తన అభిప్రాయమేంటో తెలిపితే దర్శి గురించి ఆలోచిస్తామన్నారన్నారు. నా అభిప్రాయాన్ని తెలియజేశానని, కేవలం రాజకీయ పదవుల గురించి తాను ఆలోచించడంలేదని, తన పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు.

అండగా ఉన్నవారిని వదిలేయను..
తాను దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కొనసాగిన సమయంలో తనను అభిమానించిన వాళ్లు, తనకు అండగా నిలిచినవాళ్లు చాలామంది ఉన్నారన్నారు. వారందనినీ అలా మట్టిలో వదిలేయడం తనకు ఇష్టం లేదని, తనను అభిమానించేవారినందరినీ కాపాడుకుంటానన్నారు. పూర్తి పరిష్కారమైతే రాబోయే ఎన్నికల్లో దర్శి నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేయడం అన్నారు. దానికి తగ్గ ప్రణాళికలో భాగంగానే తనఅభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు వెల్లడించారు.
ఈ పాలనను అంతమొందించి రాష్ట్రంలో మంచి పరిపాలన అందించేందుకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని, టీడీపీ అధికారంలోకి రావాలనే ఉన్నతమైన ఆలోచనతో పవన్ మద్దతిస్తున్నారని, తన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ మరోసారి స్పష్టత ఇచ్చారు.

పార్టీని కష్టకాలంలో ఆదుకున్న పమిడి రమేష్
2014 ఎన్నికల్లో దర్శి నుంచి విజయం సాధించిన శిద్ధా రాఘవరావు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. దర్శి నుంచి కదిరి బాబూరావు పోటీచేసి ఆయన కూడా ఓటమిపాలయ్యారు. ఇన్ ఛార్జి పదవి నుంచి రమేష్ అకస్మాత్తుగా తప్పుకున్నారు. మారుతున్న పరిణామాల్లో దర్శి నుంచి టీడీపీ తరఫున టికెట్ దక్కుతుందా? లేదంటే పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారా? అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. నేతలంతా పార్టీని వదిలివెళ్లిన సమయంలో పమిడి రమేష్ పార్టీ బాధ్యతల్ని తన భుజానికి ఎత్తుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు.












Click it and Unblock the Notifications